Begin typing your search above and press return to search.

స్టైలిష్ పోస్టర్: పుష్ప రాజ్ ఎక్కడా తగ్గడం లేదుగా..!

By:  Tupaki Desk   |   8 April 2021 5:20 PM IST
స్టైలిష్ పోస్టర్: పుష్ప రాజ్ ఎక్కడా తగ్గడం లేదుగా..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును 'పుష్ప' టీమ్ మరింత స్పెషల్ గా మార్చేశారు. ఇప్పటికే విడుదల చేసిన 'పుష్ప' ఇంట్రడక్షన్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లారీ డ్రైవర్ గా స్మగ్లర్ గా పుష్పరాజ్ చేసిన విధ్వంసానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బన్నీ పర్ఫార్మన్స్ కి సుకుమార్ డైరెక్షన్ - దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ - మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ తోడై ఈ మాస్ టీజర్ ను టాప్ లో నిలిపాయి. ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ అందుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నడుస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో అల్లు అర్జున్ ని ఆవిష్కరించడానికి సరైన సినిమా అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేయడానికి 'పుష్ప' మేకేర్స్ 'తగ్గేదే లే' అంటూ మరో కొత్త పోస్టర్ ని వదిలారు.

'పుష్ప' న్యూ పోస్టర్ లో అల్లు అర్జున్ ఓ బైక్ పై కూర్చొని చేయి పైకెత్తి చూపిస్తున్నాడు. బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వైట్ షర్ట్ ని టక్ చేశాడు. కోపంగా చూస్తున్నప్పటికీ పుష్ప రాజ్ రగ్గుడ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే రిలీజ్ డేట్ లేకుండా ఈ పోస్టర్ ని వదలడంపై ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'పుష్ప' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలను నిజం చేస్తున్నారా అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, 'పుష్ప' చిత్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా కనిపించనుంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కు విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో 'పుష్ప' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.