Begin typing your search above and press return to search.

ఐటమ్ భామ హల్చల్ మాములుగా లేదుగా..!!

By:  Tupaki Desk   |   5 Jan 2021 3:00 PM GMT
ఐటమ్ భామ హల్చల్ మాములుగా లేదుగా..!!
X
టెంపర్ సినిమా ప్రత్యేకగీతంలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అంటూ ఆడిపాడి తెలుగుతెరకు పరిచయమైంది మొరాకో కంట్రీ బ్యూటీ నోరా ఫతేహి. మొరాకో దేశసంతతికి చెందిన నోరా.. కెనడా దేశంలో పుట్టి పెరిగింది. టెంపర్ సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకొని బాహుబలి, కిక్ 2, ఊపిరి సినిమాలలో ప్రత్యేకగీతాలలో చిందేసింది భామ. ఐటమ్ సాంగ్స్ లో అమ్మడి అందాలకు, ఊపులకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఐటమ్ భామగా తెలిసిన నోరా.. మల్టీ టాలెంటెడ్. డాన్సర్ గానే కాకుండా నటిగా, గాయనిగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మధ్యే నోరా ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొరాకో దేశస్థురాలైన నోరా ఇంస్టాగ్రామ్ లో 20మిలియన్ల ఫాలోయర్స్ తో సెంట్రల్ ఫిగర్ గా మారింది. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన మొరాకో సెలబ్రిటీగా నోరా వార్తల్లో నిలిచింది. నోరా ఎల్లప్పుడూ తన డాన్స్, నటనతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

కానీ నోరా ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదివరకే నోరా మాట్లాడుతూ.. "ఇంస్టాగ్రామ్ అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద నెట్వర్క్. ప్రపంచంలోనే 20మిలియన్ల ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఫస్ట్ మొరాకో సెలబ్రిటీగా చాలా హ్యాపీ. ఇంతటి ఫేమ్ కి కారణమైన నా అభిమానులకు, స్నేహితులు, నన్ను సపోర్ట్ చేస్తున్న సన్నిహితులు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని మాట్లాడింది. అయితే ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న నోరా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్తకొత్త ఫోటోలతో హల్చల్ చేస్తుంది. ప్రతిభకు అందం తోడైతే నోరాలాగే ఉంటుందేమో.. సింగర్ గా రాణించి ఇప్పుడు ఏకంగా హిందీ, మలయాళం ఇండస్ట్రీలో కెరీర్ నెట్టుకొస్తోంది. తాజాగా ఈ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైట్ పింక్ అండ్ ఆరంజ్ ప్యాంటుతో అమ్మడు కుర్రకారు మనసు దోచుకుంటోంది. చూడాలి మరి మళ్లీ తెలుగులో కనిపిస్తుందేమో..!!