Begin typing your search above and press return to search.

కంప్లీట్ గా లుక్ మార్చేసిన కిరణ్ అబ్బ‌వ‌రం!

By:  Tupaki Desk   |   26 Aug 2022 9:30 AM GMT
కంప్లీట్ గా లుక్ మార్చేసిన కిరణ్ అబ్బ‌వ‌రం!
X
యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీకి వ‌చ్చి స‌క్సెస్ అయిన న‌టుడు. కుర్ర హీరోల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. యూత్ ని అట్రాక్ట్ చేసే క‌థ‌ల‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. సీమ కుర్రాడు చిచ్చ‌ర పిడుగుల దూసుకుపోతున్నాడు. ఇప్ప‌డిప్పుడే అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో అవ‌కాశాలు సైతం అందుకుంటున్నాడు.

'రాజా వారు రాణి గారు' మొద‌లైన అబ్బ‌వ‌రం ప్ర‌యాణం దేదీప్య‌మానంగా సాగిపోతుంది. తాజాగా ఈ యంగ్ హీరో కొత్త ఫోటో షూట్ లో స్టైలిష్ గా ఎలివేట్ అవుతున్నాడు. యంగ్ హీరో క‌ళ్ల అద్దాలు..సూట్ లో సరికొత్త స్టైలిష్ లుక్ ఆక‌ట్టుకుంటున్నాడు. పక్క‌నే ఓల్డ్ అంబాసిడ‌ర్ కార్ నుంచి వ‌స్తోన్న పొగ‌లు కంప్లీట్ బ్లాక్ లో షూట్ చేసిన వింటేజ్ లుక్ ఆద్యంతం అబ్బ‌వ‌రంని హైలైట్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. యంగ్ హీరో అభిమానుల్ని ఆక‌ట్ట‌కుంటుంది. ఈ లుక్ యంగ్ హీరోలో ఓ ఛేంజ్ అని చెప్పొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ స్ర్కీన్ పై మాత్ర‌మే క‌నిపించే కిర‌ణ్ ఫోటో షూట్ తో కొత్త అవ‌కాశాల‌కి దారి తేసే ఛాన్సుంది. అయినా సీమ హీరోకి అంత‌గా శ్ర‌మ‌ప‌డాల్సిన ప‌నిలేదు.

ప్ర‌స్తుతం యంగ్ హీరో చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ లు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ .. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు.

యంగ్ హీరోకి యువ‌త‌లో ఇప్పుడిప్పుడే మంచి ఫాలోయింగ్ బిల్డ్ అవుతుంది. ఆ ఫాలోయింగ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ఐడియాల‌జీని వ‌ర్కౌట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు.

ఇటీవలే కిర‌ణ్ 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన అయిన టీజర్ .. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అవుతుంది.