Begin typing your search above and press return to search.

కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్

By:  Tupaki Desk   |   8 April 2017 1:15 PM GMT
కోన ఫ్యామిలీ నుంచి మరో రైటర్
X
టాలీవుడ్లో స్టార్ రైటర్లలో ఒకడిగా మంచి పేరు సంపాదించిన కోన వెంకట్ ఈ మధ్య లైమ్ లైట్లో లేడు. ఓ దశాబ్దం పాటు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కోన.. ఇప్పుడు సైలెంటుగా ఉన్నాడు. కోన రచనలో వచ్చిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టేయడంతో ఆయన కెరీర్ దెబ్బ తింది. దీనికి తోడు ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ పెట్టడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు కోన. ఇలాంటి టైంలో కోన వెంకట్ కజిన్ అయిన నీరజ కోన అన్నయ్య బాటలో రైటర్ అవుతుండటం విశేషం. స్టైలిస్ట్ గా పెద్ద రేంజికి ఎదిగిన నీరజ.. ఈ మధ్య నెమ్మదిగా తనలోని కొత్త యాంగిల్స్ చూపిస్తోంది.

నీరజ ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ సినిమా కోసం లిరిసిస్ట్ అవతారమెత్తి ఓ పాట రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె ఓ స్క్రిప్టు కూడా తయారు చేసిందట. విశేషం ఏంటంటే.. ఆమె టాలీవుడ్ రైటర్స్ అసోసియేషన్లో తన పేరును కూడా నమోదు చేసుకుంది. స్క్రిప్టు పూర్తయ్యాక కొందరు సన్నిహితులకు చూపించగా వాళ్లు బాగా ఇంప్రెస్ అయ్యారట. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ఆమె స్క్రిప్టును సినిమాగా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కథల కొరతతో ఇబ్బందిపడుతున్న టాలీవుడ్లో మంచి స్క్రిప్టు ఉందని తెలిస్తే దానికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. నీరజ స్క్రిప్టు అలాంటిదే అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/