Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : తండ్రి కొడుకుల స్టైలిష్ సైక్లింగ్‌

By:  Tupaki Desk   |   13 Oct 2021 5:34 AM GMT
ఫొటోటాక్ : తండ్రి కొడుకుల స్టైలిష్ సైక్లింగ్‌
X
స్టైలిష్‌ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యామిలీ ఫొటోలు ఎప్పటికప్పుడు క్యూట్‌ గా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. స్నేహ రెడ్డి షేర్‌ చేసే అల్లు వారి పిల్లల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. అల్లు అర్హా మరియు అయాన్ లు నెట్టింట ఇప్పటికే సెలబ్రెటీలు అయ్యారు. తన పిల్లలతో సదరాగా ఉండే వీడియోలు మరియు ఫొటోలతో బన్నీ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి స్టైలిష్‌ లుక్ తో కొడుకు అయాన్‌ తో కలిసి అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయిస్తూనే ఉంటాడు బన్నీ.

ఇటీవల బీచ్ లో పిల్లలతో కలిసి బన్నీ ఎంజాయ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట అల్లు అభిమానులు తెగ షేర్‌ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ మరియు అయాన్‌ లు ఇద్దరు కూడా బీచ్ లో సైక్లింగ్‌ చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు సైకిల్ రైడ్‌ కు రెడీ అన్నట్లుగా ఉండగా వెనుక నుండి తీసిన ఈ ఫొటో చాలా క్యూట్‌ గా ఉంది. ముఖ్యంగా అయాన్ బుల్లి సైకిల్‌ పై షర్ట్‌ లేకుండా షార్ట్‌ వేసుకుని రైడ్‌ కు సిద్దం అన్నట్లుగా ముందుకే చాలా ఫోకస్ గా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ బన్నీ అభిమానులతో పాటు ప్రతి ఒక్క నెటిజన్‌ అనుకుంటున్నారు. ఈ ఫొటో లో తండ్రి కొడుకుల బాండింగ్ చక్కగా చూపించారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా లో నటిస్తున్నాడు. పుష్ప పార్ట్‌ 1 ను డిసెంబర్‌ లో విడుదల చేయడం కన్ఫర్మ్‌ అయ్యింది. ఇప్పటికే సినిమాకు సంబంధించినంత వరకు ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఒక పాట ఇప్పటికే వచ్చింది. రెండవ పాట దసరా కానుకగా విడుదల కాబోతుంది. బన్నీ మొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప రెండు పార్ట్‌ లు కూడా కేజీఎఫ్‌ ను మించిన యాక్షన్‌ సన్నివేశాలు కలిగి ఉంటాయని యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ప్రతి సన్నివేశం కూడా బన్నీ మరియు సుకుమార్‌ ల కష్టంను చూపించబోతున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు. బన్నీ ఈ సినిమా కోసం రెండేళ్లుగా తన లుక్ ను మెయింటెన్ చేస్తున్నాడు.