Begin typing your search above and press return to search.

టైటిల్ సంగతేంటి ? బాలయ్య

By:  Tupaki Desk   |   1 Sep 2019 9:30 AM GMT
టైటిల్ సంగతేంటి ? బాలయ్య
X
ప్రస్తుతం కే. ఎస్ .రవి కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలయ్య. 'ఎన్టీఆర్ మహనాయకుడు' తర్వాత బోయపాటి శ్రీనుని పక్కన పెట్టి మరీ రవి కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతేడాది 'జై సింహ' తో ఈ కాంబినేషన్ సక్సెస్ అందుకుంది. అందుకే మళ్లీ రవి కుమార్ తోనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో బాలకృష్ణ న్యూ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.

లేటెస్ట్ గా వినాయక చవితి శుభాకాంక్షలతో ఓ రెండు పోస్టర్స్ కూడా వదిలారు. ఈ రెండు పోస్టర్స్ ప్రెజెంట్ ట్రేడింగ్ లో ఉన్నాయి. ఒక పోస్టర్ లో సోనాల్ చౌహన్ తో కలిసి రొమాంటిక్ గా స్టిల్ ఇచ్చాడు నటసింహం. ఇక అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ సినిమాకు టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నిజానికి వినాయక చవితి సంధర్భంగా టైటిల్ అనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా టైటిల్ గురించి డిస్కర్షన్ జరుగుతుండటంతో 105 అని పోస్టర్ వదిలారు.

ఈ సినిమాకు కూడా జై సింహ లాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. అందుకే ఇంకా టైం తీసుకుంటున్నారు. రూలర్ అనే టైటిల్ ను కూడా పరీశీలుస్తున్నారు. త్వరలోనే టైటిల్ ని ఫైనల్ చేసుకొని ఓ మంచి ముహూర్తం చూసి రివీల్ చేస్తారు. అప్పటి వరకూ ఈ సినిమాను బాలయ్య 105 అని పలకాల్సిందే.