Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌2 : రాఖీ vs అధీరా కోసం అన్బు అరివు

By:  Tupaki Desk   |   7 Dec 2020 8:41 AM GMT
కేజీఎఫ్‌2 : రాఖీ vs అధీరా కోసం అన్బు అరివు
X
కన్నడ ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'కేజీఎఫ్‌ 2' అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన యాక్షన్‌ సీన్స్‌ తో రూపొందిన కేజీఎఫ్‌ మొదటి చాప్టర్‌ రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుని బాలీవుడ్‌ సినిమాలను సైతం పక్కకు నెట్టేంతగా వసూళ్లు దక్కించుకుంది. కేజీఎఫ్‌ 2 ముందు కేజీఎఫ్‌ 1 కేవలం ట్రైలర్‌ మాత్రమే అంటూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేజీఎఫ్‌ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నెల చివరి వరకు కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ ను ముగించాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. రాఖీ మరియు అధీరాల మద్య అంత్యంత భయంకరమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా యశ్‌ మరియు సంజయ్‌ దత్‌ ల మద్య భారీ యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ యాక్షన్‌ సన్నివేశాలకు స్టంట్స్ మాస్టర్స్‌ అన్బు మరియు అరివులు నేతృత్వం వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో వచ్చిన ఎన్నో యాక్షన్‌ సన్నివేశాలు అద్బుతంగా నిలిచాయి. యాక్షన్‌ సినిమాల కు మోస్ట్‌ వాంటెడ్‌ స్టంట్స్‌ మాస్టర్స్‌ అయిన వీరద్దరు ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 కోసం పని చేస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.