Begin typing your search above and press return to search.

కళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తున్న జాన‌

By:  Tupaki Desk   |   29 April 2022 10:00 AM IST
కళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తున్న జాన‌
X
శ్రీ‌లీల ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ స‌ర‌స‌న పెళ్లిసంద‌-డిలో న‌టించిన ఈ బ్యూటీ త‌న‌దైన న‌ట‌న ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో మైమ‌రిపించింది. న‌టించిన ఒక్క సినిమాతోనే బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అస‌లింత‌కీ ఇత‌ర భామ‌ల‌కు లేనిది శ్రీ‌లీల‌కు మాత్ర‌మే ఉన్న‌ది ఏమిటీ? అని ప్ర‌శ్నిస్తే.. క‌చ్ఛితంగా ఇదిగో ఇక్క‌డ ఆన్స‌ర్ దొరుకుతుంది. శ్రీ‌లీల ఎన‌ర్జీకి మించి హాట్ కిల్ల‌ర్ లుక్స్ త‌న‌కు పెద్ద అస్సెట్ అని చెప్పాలి. ఇదిగో ఇలా వాలు చూపుల‌తో వ‌ల‌లు విసురుతున్న ఈ బ్యూటీ క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తోంది. లెట్ ది ఐస్ డు ది టాకింగ్.. అంటూ తాజాగా శ్రీ‌లీల షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. శ్రీ‌లీల‌కు యూత్ నుంచి ల‌వ్ ఈమోజీలు వెల్లువెత్తుతున్నాయి. త‌ను ఓకే అనాలే కానీ ప్రేమ కానుక‌లు పంపేందుకు రెడీ అన్నంత క‌సిగా ఉన్నారు బోయ్స్. ఘాటైన లుక్స్.. కొంటె చూపుల‌తో బాణం గురి చూసి విసిరింది ఈ బ్యూటీ.

నితిన్ తో జాక్ పాట్..

యూత్ స్టార్ నితిన్ `మాచర్ల నియోజక వర్గం` త‌ర్వాత న‌టించ‌నున్న సినిమాలో శ్రీ‌లీల క‌థానాయిక‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆ సినిమా ఇంత‌కుముందే అధికారికంగా లాంచ్ అయింది. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీలకు న‌టించేందుకు బిగ్‌ స్కోప్ ద‌క్క‌నుందిట‌. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఇక బ‌న్నీతో `నా పేరు సూర్య` త‌ర్వాత కొంత గ్యాప్ తో వ‌క్కంతం వంశీ ఈ సినిమా చేస్తున్నాడు. ద‌మ్మున్న‌ర‌చ‌యిత‌గా నిరూపించిన అతడు ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

పారితోషికంలో పీక్స్...

ఒక్కో క‌మిట్ మెంట్ కి 70ల‌క్ష‌లు పైగా పారితోషికం అందుకుంటూ వ‌న్ ఫిలిం వండ‌ర్ శ్రీ‌లీల జోరు పెంచేసింద‌న్న టాక్ వినిపిస్తోంది. నితిన్.. వైష్ణ‌వ్ తేజ్.. న‌వీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాల‌కు ఇదివ‌ర‌కూ క‌మిటైంది. ఈ సినిమాల‌కు ఒక్కో మూవీకి పారితోషికంగా 70ల‌క్ష‌లు పైగా అందుకుంటోంద‌ట‌. తాజా స‌మాచారం మేరకు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ- అనీల్ రావిపూడి మూవీ కోసం శ్రీ‌లీల‌ను సంప్ర‌దించార‌ని కూడా టాక్ వినిపించింది. న‌ట‌సింహాకు కూతురి పాత్రలో న‌టిస్తుంద‌ని కూడా టాక్ వైర‌ల్ అయ్యింది. క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర అని తెలిసింది. కానీ శ్రీ‌లీల చెప్పిన పారితోషికం విని నిర్మాత‌లు షాక్ తిన్నార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి.