Begin typing your search above and press return to search.

అలా చేయ‌డం శ్రీ‌లీల‌ వ‌ల్ల కావ‌డం లేద‌ట‌

By:  Tupaki Desk   |   5 March 2022 6:00 AM IST
అలా చేయ‌డం శ్రీ‌లీల‌ వ‌ల్ల కావ‌డం లేద‌ట‌
X
హీరోల‌ని మించి హీరోయిన్ లు నెట్టింట ఫుల్ యాక్టీవ్ గా వుంటున్నారు. ప్ర‌తీ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. `పెళ్లిసంద‌D` హీరోయిన్ శ్రీ‌లీల కూడా స్టార్ హీరోయిన్ ల‌తో పోటీప‌డుతూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ల‌తో వైర‌ల్ అవుతోంది.

తాజాగా హీరోయిన్ శ్రీ‌లీల పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి రూపొందించిన చిత్రం `పెళ్లిసంద‌D`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా రీ లాంచ్ అయిన ఈ మూవీతో శ్రీ‌లీల హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది.

ఈ చిత్రాన్ని `బాహుబ‌లి` మేక‌ర్స్‌ ఆర్కా మీడియా శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిల‌తో క‌లిసి ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యాన‌ర్ పై మాధ‌వి కోవెల‌మూడి నిర్మించారు. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్నిసాధించ‌డ‌మే కాకుండా హీరోయిన్ గా శ్రీ‌లీల‌కు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ల‌ని అందించింది. తొలి చిత్రం అయినా అందం, అభిన‌యంతో గ్లామ‌ర‌స్ హీరోయిన్ గా ఆక‌ట్టుకుంది.

అంతే కాకుండా తొలి చిత్రంతోనే గ్లామ‌ర‌స్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో క‌లిసి `ధ‌మాకా` చిత్రంలో న‌టిస్తోంది. త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ఫోర్త్ షెడ్యూల్ ఇటీవ‌లే పూర్తి చేసుకుని త‌దుప‌రి షెడ్యూల్ కి రెడీ అయిపోతోంది.

ఇదిలా వుంటే తాజాగా శ్రీ‌లీల పెట్టిన పోస్ట్ ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌న‌సు చంచ‌ల‌మైన‌ద‌ని, దాన్ని నియంత్రించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, కానీ నిరంత‌రం నేర్చుకోవ‌డం ద్వారా మ‌న‌సును నియంత్రిచ‌వ‌చ్చ‌ని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్ కి అనుగుణంగా ఫొటోల‌ని షేర్ చేసింది.

ప్ర‌స్తుతం శ్రీ‌లీల పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. శ్రీ‌లీల చేతిలో ప్ర‌స్తుతం తెలుగులొ ర‌వితేజ మూవీ మాత్ర‌మే వుంది. అంతే కాకుండా మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ చేయ‌నున్న చిత్రంలోనూ శ్రీ‌లీల న‌టించ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగులో ప్ర‌య‌త్నాలు చేస్తూనే శ్రీ‌లీల క‌న్న‌డ‌లోనూ రానిస్తోంది.

ఇప్ప‌టికే శ్రీ‌లీల క‌న్న‌డ‌లో న‌టించిన కిస్‌, భ‌రాటే వంటి చిత్రాలు గ‌త ఏడాది విడుద‌లే ఆమెకు మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ని అందించాయి. ఇటీవ‌లే `బై టు ల‌వ్‌` పేరుతో రూపొందిన చిత్రం విడుద‌లైంది. త్వ‌ర‌లో నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ స‌ర్జాతో క‌లిసి న‌టిస్తున్న‌ `దుబారి` ఈ ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌ల కాబోతోంది.