Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ కూతురునే ట్రాప్ చేసిన జూ. ఆర్టిస్ట్!

By:  Tupaki Desk   |   28 July 2016 11:16 AM GMT
ప్రొడ్యూసర్ కూతురునే ట్రాప్ చేసిన జూ. ఆర్టిస్ట్!
X
ప్రేమకు కులం ఉండదు - మతమూ ఉండదు.. ధనిక పేద అనే భేదాలనెరుగదు .. ఇలా ప్రేమ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి కవితలు - కథలు చదివిన అనుభవమో లేక నిజంగానే ప్రేమో కానీ... ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏకంగా ప్రొడ్యూసర్ కూతురునే ప్రేమలోకి దింపాడు! ముందుగా పరిచయం.. స్నేహం.. ప్రేమ.. ఫైనల్ గా ఏమి జరిగిందో ఇప్పుడు చుద్దాం!

బాలీవుడ్ కు చెందిన ఒక బడా ప్రొడ్యూసర్ కూతురుని ట్రాప్ చేశాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన గుడ్డు అన్సారీ అనే ఈ 28ఏళ్ల యువకుడు ఆ ప్రొడ్యూసర్ నిర్మించబోయే సినిమాకు సంబందించిన ఆడిషన్స్ కు వెళ్లాడు. అక్కడే ఉన్న ఆ నిర్మాత కూతురితో పరిచయం పెంచుకున్నాడు - ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.. పరిచయం ప్రేమగా మారడానికి పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. తర్వాతే ఇతగాడి బుర్ర గాడితప్పింది.

ఇలా సాగుతున్న వారి ప్రేమ వ్యవహారానికి ఇక పులుస్టాప్ పెట్టేసి పెళ్లిచేసుకుందామని అడిగాడు అన్సారీ. దానికి అంగీకరించిన ఆమె.. తన తండ్రికి చెప్పి చేసుకుందామని అన్నదట... దానికి ఒప్పుకోని అతడు ఆమెను రహస్యంగా పెళ్లిచేసుకుందామని బలవంతం చేశాడట. ఆపనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. అన్సారీలో రెండో కోణం వెలుగులోకి వచ్చింది. ఆమెను నిత్యం ఫోన్ లో వేదించడం - బెదిరించడం - అసభ్యకర ఫోటోలు పంపడం వంటివి చేస్తుండేవాడు. దీంతో ఇక విషయం తన తండ్రికి చెప్పేసింది ఆ యువతి. వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు! ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న అన్సారీ.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తుంటాడు!