Begin typing your search above and press return to search.

ఒక‌టే మూవీ రెండు టైటిళ్ల‌తో రిలీజ్ చేస్తామ‌ని కొట్లాట‌

By:  Tupaki Desk   |   18 Sep 2020 2:30 AM GMT
ఒక‌టే మూవీ రెండు టైటిళ్ల‌తో రిలీజ్ చేస్తామ‌ని కొట్లాట‌
X
కీర్తి సురేష్ న‌టించిన డెబ్యూ మూవీ `ఐనా ఇష్టం నువ్వు` ర‌క‌ర‌కాల వివాదాల న‌డుమ వాయిదా ప‌డి ఐదేళ్ల‌కు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని క‌ళాద‌ర్శ‌కుడు చంటి అడ్డాల నిర్మించ‌గా.. న‌ట్టి కుమార్ మూవీ రిలీజ్ రైట్స్ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని అంటున్నారు. ఇంత‌కీ ఎవ‌రు హ‌క్కుదారు? అన్న‌దానిపై ఇద్ద‌రి మ‌ధ్యా ఏళ్ల‌కు ఏళ్లుగా వివాదం ప‌రిష్కారం కావ‌డం లేదు. ఎవ‌రూ చొర‌వ చూప‌క‌పోవ‌డం ఇందులో పెద్ద ట్విస్టు.

తీరా ఓటీటీ రిలీజ్ అయినా చేద్దామ‌నుకున్న చంటి అడ్డాల‌కు న‌ట్టి అడ్డు ప‌డుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆస‌క్తిక‌రంగా ఈయ‌న ఒక టైటిల్ తో రిలీజ్ చేయాల‌నుకుంటే .. ఆయ‌న అదే సినిమాని వేరొక టైటిల్ తో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశార‌ట‌. నిజంగానే ఇది వింతైన ప‌రిస్థితి అన్న టాక్ వినిపిస్తోంది.

`ఐనా ఇష్టం నువ్వు` టైటిల్ తో రైట్స్ కొనుక్కున్నాన‌ని చెబుతున్న‌ న‌ట్టి కుమార్ రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా.. `జాన‌కితో నేను` టైటిల్ తో చంటి అడ్డాల మూవీని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. టైటిల్ మార్పుతో బావుంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అందుకు సంబంధించి పోస్ట‌ర్లు వేసేయ‌డంతో వివాదం మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. ఇంత‌కీ ఈయ‌న రిలీజ్ చేయాలా? ఆయ‌న రిలీజ్ చేస్తారా..? అన్న‌దానికి ఫిలింఛాంబ‌ర్ అయినా ప‌రిష్కారం ఇవ్వ‌లేక‌పోవ‌డం కామెడీనే అంటూ పంచ్ లు వేస్తున్నారు కొంద‌రు. అయినా ఒకే సినిమాని ఇద్ద‌రు ఎలా రిలీజ్ చేయ‌గ‌ల‌రు? ప‌ంపిణీదారు ఓటీటీకి అవ‌స‌రం లేదనుకుంటే క‌నీసం ఓటీటీ కంపెనీలు అయినా ఎవ‌రి నుంచి ఈ సినిమాని కొనాలి? అన్న‌ది స‌స్పెన్స్ గానే మారింది.

ఇక‌పోతే న‌ట్టి కుమార్ రైట్స్ కొనుక్కున్నాన‌ని ఇంకా పెద్ద మొత్తం డిమాండ్ చేస్తూ చంటి అడ్డాల బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనేదెవ‌రు? అన్న‌ది చూడాలి. ఆస‌క్తిక‌రంగా ఇంకా ఈ మూవీకి ప్యాచ్ వ‌ర్క్ చేయాల్సి ఉంద‌ట‌. సీన్ ఇలా గొడ‌వ‌ల మ‌యంగా ఉంటే కీర్తి వ‌స్తుందా రాదా? అన్న‌ది సందిగ్ధంగా మారింది.