Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ బిజినెస్ కి స్ట్రెయిన్ ఝలక్ మామూలుగా లేదే
By: Tupaki Desk | 3 Jan 2021 11:30 PM GMTకొత్తగా వచ్చిన స్ట్రెయిన్ వైరస్ ప్రభావం ఇండియాకి పాకిన సంగతి తెలిసిందే. బ్రిటన్ నుంచి ఇక్కడ దిగిన వారి నుంచి సుమారు 30 మందికి ఈ వైరస్ పాకిందన్న వార్తల నడుమ దేశవ్యాప్తంగా అలెర్టయ్యారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్ కి పెద్దన్నలా బిజినెస్ ఆస్కారం ఉన్న అమెరికాకు స్ట్రెయిన్ టెన్షన్ తప్పడం లేదు. అక్కడా ఈ కేసులు విరివిగా వెలుగు చూడడంతో దేశంలో లాక్ డౌన్ల ప్రక్రియ మొదలవుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
సరిగ్గా ఇదే పాయింట్ టాలీవుడ్ ని టెన్షన్ పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సన్నివేశం ఇప్పుడిప్పుడే మెరుగవుతుంటే భారీ సినిమాలను అన్నిచోట్లా రిలీజ్ చేసేందుకు తేదీల్ని ఫిక్స్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా అమెరికా మార్కెట్ నుంచి దాదాపు 8-9 కోట్ల మేర బిజినెస్ పెద్ద హీరోలకు ఉంది. అదంతా మునుముందు రిలీజ్ కి రానున్న సినిమాలకు మిస్సయినట్టేనా? అన్న చర్చా సాగుతోంది. చరణ్ .. బన్ని సినిమాలకు అమెరికా నుంచి 15-20 కోట్ల వసూళ్లు దక్కుతున్నాయి. వీళ్ల సినిమాలేవీ ఇప్పట్లో లేకపోయినా మార్చి- ఏప్రిల్ నుంచి పలు క్రేజీ చిత్రాలు ఓవర్సీస్ లోనూ రిలీజవుతాయని అంచనా. అప్పటికి స్ట్రెయిన్ పరిస్థితి ఇలానే కొనసాగితే ఆ మేరకు బిజినెస్ పై పంచ్ పడిపోతుందని భావిస్తున్నారు.
ఇక 25-50 కోట్ల మేర పారితోషికాలు అందుకునే హీరోలు.. 10-20 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్న స్టార్ డైరెక్టర్లు కాస్త ఆలోచించి నిర్మాతకు ఆ మేరకు భారం తగ్గిస్తారా? అన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రెండు మూడు నెలల వరకూ మినిమంగా ఇదే సన్నివేశం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ ఇప్పుడే పూర్తిగా అందుబాటులోకి రాదు కాబట్టి ఆ మేరకు ప్రజల్లోనూ భయాందోళనలు తొలగిపోవడం కష్టం. ఏదేమైనా 2021 ఆరంభం కూడా టాలీవుడ్ సహా వినోద పరిశ్రమలకు ఇబ్బందికర పరిణామం నెలకొందనే చెప్పాల్సి ఉంటుంది.