Begin typing your search above and press return to search.

రానా హిర‌ణ్య‌క‌సిపుడు క‌థేమిటి?!

By:  Tupaki Desk   |   31 March 2019 2:02 PM GMT
రానా హిర‌ణ్య‌క‌సిపుడు క‌థేమిటి?!
X
వ‌రుస ప్ర‌యోగాలతో రానా అంత‌కంత‌కు వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రానా ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్క‌నున్న `హిర‌ణ్య క‌సిప` (హిర‌ణ్య కశ్య‌పుని చ‌రిత్ర‌) చిత్రంపై టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో రానా ఏ పాత్ర‌లో న‌టిస్తాడు? అంటే.. హిర‌ణ్య క‌శ్య‌ప అనే రాక్ష‌సుడి పాత్ర‌లో న‌టించ‌నున్నారని తెలుస్తోంది. పురాణాల్లో ఎంతో విశిష్ఠ‌త ఉన్న క‌థాంశ‌మిది. విజువ‌ల్ గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే భారీ బ‌డ్జెట్ వెచ్చించి, ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నున్నారు.

క‌థాంశం ప‌రిశీలిస్తే.. హిర‌ణ్య క‌శిప అనే రాక్ష‌స‌రాజుకు ప్ర‌హ్లాదుడు అనే కుమారుడు జ‌న్మిస్తాడు. అత‌డు పుట్టుక‌తోనే మ‌హావిష్ణువు భ‌క్తుడు. విష్ణువుకి భ‌క్తుడిగా విష్ణు నామ జ‌పం చేస్తుంటాడు. అయితే తండ్రి హిర‌ణ్య క‌సిపుడికి అది ఏమాత్రం రుచించ‌దు. దాంతో ప్ర‌హ్లాదుని చంపించేందుకు ర‌క‌ర‌కాల కుయుక్తులు ప‌న్నుతుంటే మ‌హావిష్ణువు అత‌డిని ర‌క‌ర‌కాల మార్గాల్లో ర‌క్షిస్తుంటారు. అస‌లు నీ దేవుడు ఎక్క‌డ ఉన్నాడు? అంటూ ఎంతో కోపోద్రిక్తుడైన హిర‌ణ్య క‌సిపుడు ఓ స్థంబాన్ని త‌న గ‌దాయుధంతో బ‌ద్ధ‌లు కొడతాడు. రెండుగా చీలిన ఆ స్థంభం నుంచి ఉగ్ర న‌ర‌సింహుని రూపంలో శ్రీ మ‌హావిష్ణువు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. అటుపై ఆ రాక్ష‌సుడిని పొట్ట చీల్చి సంహ‌రిస్తాడు. అయితే హిర‌ణ్య క‌సిపుడిని రాత్రి కానీ, ప‌గ‌లు కానీ, ఆయుధంతో కానీ మ‌నిషి ఎవ‌రూ సంహ‌రించ‌లేరన్న వ‌రం ఉంటుంది. ఆ క్ర‌మంలోనే వ‌రాహ న‌ర‌సింహ‌స్వామి రూపంలో అత‌డిని చావు వ‌రిస్తుంది. స్థూలంగా క‌థాంశ‌మిది. ఇందులో రానా హిర‌ణ్య క‌సిపుడు అనే రాక్ష‌సుడిగా న‌టించ‌నున్నాడు.

ఈ సినిమా కోసం ఇటు హైద‌రాబాద్ లో అటు అమెరికాలో మొత్తం 16 చోట్ల వీఎఫ్ ఎక్స్- యానిమేష‌ర్స్ కి సంబంధించిన ప‌నులు సాగుతున్నాయ‌ని నిర్మాత డి.సురేష్ బాబు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అమ‌ర చిత్ర‌క‌థ క‌థ‌లు స‌హా పురాణేతిహాసాలు అంటే రానా బాబుకు ఇష్టం. వాటిని సినిమాలుగా తీస్తే న‌టించేందుకు ఆసక్తిగా ఉన్నాడ‌ని డిసురేష్ బాబు ఇదివ‌ర‌కూ తెలిపారు. ఆ కోరిక‌ను ఇప్పుడు నిజం చేస్తున్నారు. హిర‌ణ్య క‌సిప‌ చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక దీంతో పాటే అమ‌ర చిత్ర క‌థ అనే కామిక్ బుక్ కంపెనీకి రానా త‌న‌వంతు ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టింకిల్ డైజెస్ట్ అనే కంపెనీ ద్వారా అమ‌ర చిత్ర‌క‌థ పుస్త‌కాల్ని విక్ర‌యిస్తున్నారు. 35 భాష‌ల్లో ఇప్ప‌టికే 100 మిలియ‌న్ జ‌నాలు ఈ పుస్త‌కాల్ని కొనుగోలు చేశారు. 450 ర‌కాల టైటిల్స్ ని అమ‌ర చిత్ర‌క‌థ పుస్త‌కాల‌కు ఉప‌యోగించారు ఇప్ప‌టికి. అయితే ఇలా పుస్త‌కాల ద్వారా ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ కి మ‌నవైన భార‌తీయ‌త నిండిన అమ‌ర‌చిత్ర క‌థ‌ల్ని ప‌రిచయం చేస్తే వేరొక ప్ర‌యోజ‌నం ఉంది. అమ‌ర‌చిత్ర‌క‌థ కామిక్ క్యారెక్ట‌ర్ల‌ను ఉప‌యోగించి భారీ స్థాయిలో సినిమా రూప‌క‌ల్ప‌న చేస్తే అందులో రానా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి అయితే రానా బుక్ ప‌బ్లిష‌ర్స్ కి త‌న‌వంతు సాయంగా ప్ర‌చారం చేస్తున్నారు.