Begin typing your search above and press return to search.

బాహుబలి 2 గురించి ఇదో గోల

By:  Tupaki Desk   |   27 July 2015 11:48 AM IST
బాహుబలి 2 గురించి ఇదో గోల
X
బాహుబలి 1తో పెద్ద ఫజిల్‌ వేశాడు రాజమౌళి. ఈ ఫజిల్‌ ని రెండో భాగంలో విప్పుతానని తాపీగా తన పనిలో తానున్నాడు. అయితే ఈలోగానే జనాలు తెగ కొట్టేసుకుంటున్నారు. బాహుబలి : ది కన్‌ క్లూజన్‌ కథేంటో ముందే ఎవరికి వారు అంచనా వేసేస్తున్నారు. కన్‌ క్లూజన్‌ కథని విజయేంద్ర ప్రసాద్‌కి వదిలేయకుండా జనాలే రాసేస్తున్నారు.

అంతెందుకు మొన్నటికి మొన్న విజయేంద్ర ప్రసాద్‌ ఓ మాటన్నారు. బాహుబలి రెండో భాగంలో ముగ్గురు ప్రభాస్‌ లు, ఇద్దరు రానాలు, ఇద్దరు అనుష్క లు ఉంటారని చెప్పారు. అంతే ఇక అది పట్టుకుని తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఇద్దరు ప్రభాస్‌ లు, ఒక రానా, ఒక అనుష్క తోనే 400కోట్లు వసూలు చేస్తే ఇక ఇంతమందితో ఇంకెంత వసూలు చేసేస్తుందో బాబోయ్‌ అంటూ తెగ అంచనాల్ని పెంచేస్తున్నారు. అయితే ఎంతమంది ప్రభాస్‌ లు, రానాలు కాదన్నయ్యా .. కంటెంట్‌ ఎంత కన్విన్సింగ్‌ గా ఉంది? అనేది ఇంపార్టెంట్‌. కథలో కన్‌ క్లూజన్‌ సరిగా ఇవ్వకపోతే గేరు రివర్సు లో పడుతుంది.

కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాల్సొచ్చింది. శివగామి మనసులో అసలు కథేంటి? అసలు అవంతిక లో సీక్రెట్‌ ఏం దాగుంది? ఇలాంటి విషయాలన్నిటికీ పార్ట్‌ 2 లో సమాధానం చెప్పకపోతే .. అంతే సంగతి. కాబట్టి మీరు కథలు రాయకుండా రచయిత కే ఆ పని అప్పగించండి మహా ప్రభో!