Begin typing your search above and press return to search.
టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంచ్ వెనక కథ ఇదేనట..!
By: Tupaki Desk | 27 May 2023 2:05 PMమాస్ మహారాజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. అన్ని సినిమాల ఫస్ట్ లుక్ విడుదలకంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భిన్నంగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై లాంచ్ చేశారు. హీరో వెంకటేష్ ఈ పోస్టర్ లాంచ్ చేయడం విశేషం.ఇతర భాషల్లో కార్తీ, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్, జాన్ అబ్రహం టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అన్ని భాషల హీరోలతో లాంచ్ చేయించడం ఒక కొత్త కాన్సెప్ట్ అయితే, రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ దగ్గర చేయించడం మరో కొత్త విధానం. ఇలా చేయించడం వెనక ఉన్న కథను నిర్మాత స్వయంగా వివరించారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.
భారత దేశంలో ఎవరికీ తెలియని చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.తాను దేశంలోని ఐకానిక్ ప్రదేశాలను హైలెట్ చేయాలని భావించినట్లు ఆయన చెప్పారు. దాని కోసమే రాజమండ్రి హైవే వంతనెను ఎంచుకున్నట్లు చెప్పారు. అందరూ చిత్ర నిర్మాతలు భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహంచాలని ఆయన ఈ సందర్భంగా కోరడం విశేషం.
ఇక సినిమా విషయానికి వస్తే, స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం సినిమా తీయాలని చాలా మంది చాలా సార్లు అనుకున్నారు. ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు తో అది పూర్తౌతోంది. ఈ సినిమా నూతన దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాని ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. గజదొంగగా రవితేజ లుక్ ఆకట్టుకుంది. ఆయన కళ్లల్లో ఇంటెన్సిటీ క్లియర్ గా కనపడుతోంది. రావణాసుర ప్లాప్ తో ఉన్న రవితేజ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఆ హిట్ ఈ సినిమా అందిస్తుందనే ఆశతో చిత్ర బృందం ఉంది. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ మూవీతో రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు. కాగా టైటిల్ కి తగినట్టుగానే హీరో రవితేజ లుక్ ను టైగర్ ఫేస్ తరహాలో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఆయన చూపుల్లో కసి .. కోపం కనిపిస్తున్నాయి. ఈ పాత్రలో రవితేజ ఒక రేంజ్ లో తన సత్తా చూపనున్నాడనే విషయం అర్థమవుతోంది.