Begin typing your search above and press return to search.

చిత్రలహరి టైటిల్ చిత్రం అదేనట!

By:  Tupaki Desk   |   12 Aug 2018 6:35 AM GMT
చిత్రలహరి టైటిల్ చిత్రం అదేనట!
X

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరస ఫ్లాపులతో సతమతమౌతున్న విషయం తెలిసిందే. జయాపజయాలు ఇండస్ట్రీలో కామన్ అయినా ఈ సారి తన లుక్స్ మీద కూడా విమర్శలు రావడంతో కాస్త బ్రేక్ తీసుకొని అమెరికా వెళ్ళాడు. మెగా హీరో ఈ బ్రేక్ లో తన ఫిట్ నెస్ పై ఫోకస్ చేసి మళ్ళీ స్లిమ్ అవతారంలోకి మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇండియాకు తిరిగి రాగానే తన నెక్స్ట్ సినిమా 'చిత్రలహరి' రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడట.

కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కునున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిత్రలహరి అనే పేరుతో బార్ & రెస్టారెంట్ ఉంటుందని కథలో అది కీలకమని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాంతోపాటు 'చిత్రలహరి' టైటిల్ లో హీరోయిన్ లు కూడా ఉన్నారట. అదెలాగంటే.. ఈ సినిమాలో తేజ్ ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ చేస్తాడట. అందులో ఒక హీరోయిన్ పేరు చిత్ర కాగా రెండో హీరో పేరు లహరి. కిషోర్ తిరుమల చమత్కారం సూపర్ కదా.

మరోవైపు ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేద థామస్ ను ఫైనలైజ్ చేశారట. చిత్ర, లహరి లలో ఆమె ఏ పాత్ర పోషిస్తుందో ఇంకా బయటకు రాలేదు గానీ ప్రస్తుతం వాళ్ళు సెకండ్ హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. మరోవైపు ఈ సినిమా ఈమధ్యే రిలీజ్ అయిన కళ్యాణ్ దేవ్ సినిమా 'విజేత' తరహాలో తండ్రీ-కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని రూమర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.