Begin typing your search above and press return to search.
ముంబై పార్టీలో చరణ్.. వెనక కథ అదేనా?
By: Tupaki Desk | 3 Aug 2019 9:43 AM ISTకియారా అద్వాని బర్త్ డే వేడుకలకు రామ్ చరణ్ హాజరైన ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సహజంగా మన సౌత్ స్టార్స్ ముంబై పార్టీలలో సందడి చేయడం తక్కువే. దీంతో చరణ్ బర్త్ డే పార్టీ లో మెరవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. జక్కన్నగారి 'అల్లూరి' కోరమీసం లుక్ కూడా మొదటిసారి బయటకు వచ్చింది. పార్టీనే కాకుండా చరణ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కియారాకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ - కియారా జంటగా నటించారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. సినిమా ఫలితం నిరాశపరిచింది కానీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ మాత్రం కంటిన్యూ అవుతోందట. ఆ స్నేహంతోనే చరణ్ ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడని అంటున్నారు. అయితే ఇదొక్కటే కారణం కాదని.. చరణ్ బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడని.. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి మెలిసి తిరిగే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. చరణ్ గతంలో 'జంజీర్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అప్పటికి సౌత్ హీరోలంటే ముంబైలో పెద్దగా పట్టించుకునేవారు కాదు.. కానీ 'బాహుబలి' తర్వాత పరిస్థితి మారిపోయింది. సౌత్ సినిమాలపై.. స్టార్లపై బాలీవుడ్ లో ఆసక్తి పెరిగింది.
చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'RRR' లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలాగూ హిందీలో రిలీజ్ అవుతుంది కాబట్టి చరణ్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. అందుకే ఇప్పటి నుంచి ప్యాన్ ఇండియా మార్కెట్ పై పట్టు సాధించే దిశలో చరణ్ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడని అంటున్నారు. RRR తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయాలపై మనకు RRR రిలీజ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.