Begin typing your search above and press return to search.

నోబిత దగ్గరకు డోరెమాన్ ఎలా వచ్చాడు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా..?

By:  Tupaki Desk   |   18 May 2023 8:00 PM
నోబిత దగ్గరకు డోరెమాన్ ఎలా వచ్చాడు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా..?
X
ఈతరం పిల్లలకు డోరేమాన్, నోబిత పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమ ఇంట్లో వాళ్ల పేర్లైనా సరే గుర్తుంటాయో లేదో కానీ డోరేమాన్ నోబిత షిజుకా జియాన్ సునుయో డోరేమీ ఈ పేర్లు మాత్రం వారు మర్చిపోలేరు. ఇంతకీ అసలు డోరేమాన్ ఎలా ఏర్పడ్డాడు.. డోరేమాన్ నోబిత దగ్గరకు ఎలా వచ్చాడు.. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది.. ప్రతిరోజు పిల్లలు టీవీల్లో ఆసక్తికరంగా చూసే ఈ డోరేమాన్ కథ ఏంటో ఒకసారి చూసేద్దాం.

డోరేమాన్ సీరీస్ జపనీస్ మాంగా సీరీస్ అంటారు. డోరేమాన్ సీరీస్ క్రియేటర్ పేరు ఫిజికో ఎఫ్ ఫిజియో. మాంగా సీరీస్ మొదటి ఎపిసోడ్ 1969 లోనే ప్రసారమైంది. 1973,1979 లలో టీవీ సీరీస్ లాగా ఇవి ప్రసారమయ్యాయి. 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సీరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. నేటి తరం పిల్లలకు డోరేమాన్ అంటే ఎవరో పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇంట్లో ఆడవాళ్లు సీరియల్స్ చూసే చానల్స్ కన్నా ఈ కార్ట్ ఛానల్స్ ఎక్కువ ఉంటున్నాయి.

చదువుతో పాటు విజ్ఞానం.. ఎంటర్టైన్ మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకు ఈ కార్టూన్ సీరీస్ లను చూసే అవకాశం కల్పిస్తున్నారు. అందుకే ఈమధ్య ఈ కార్టూన్ సీరీస్ లకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. వాటిలో డోరేమాన్ అయితే విశిష్టంగా ఆకట్టుకుంటుంది.

డోరేమాన్ నోబిత ఈ రెండు పాత్రలే ప్రధానంగా డోరేమాన్ సీరీస్ కొనసాగుతుంది. అయితే దీనికి అసలు కథ ఏంటంటే నోబిత వాళ్ల మనవడు షివాశి తనకు దొరికిన టైం మిషన్ తో తన తాత నోభిత చదువుల్లోనూ ఆటల్లోనూ వెనకబడటం గురించి తెలుసుకుంటాడు. ఆ టైం లో తను మళ్లీ నోబిత జీవితాన్ని డోరేమాన్ సహాయంతో బాగు పరచాలని చూస్తాడు.

అలా టైం మిషన్ ద్వారా వెళ్లి నోబిత దగ్గర డోరేమాన్ ను ఉంచుతాడు. నోబిత డోరేమాన్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. నోబితకు వచ్చిన ప్రతి సమస్యను డోరేమాన్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు డోరేమాన్ ఒక రోబోట్ క్యాట్ తన గాడ్జెట్స్ తో నోబిత ప్రయోగాలు చేసి అలా కూడా సమస్యల్లో పడతాడు.

నోభిత అసలు పేరు నోభి నోభిత. నోబిత ఎంత అల్లరి చేసినా సరే డోరేమాన్ కి కోపం రాదు. డోరేమాన్ తనతో ఉంటే తాను ఏమైనా చేయగలను అన్న నమ్మకం నోబితకు ఉంటుంది. సో ఇది డోరేమాన్ ఇంట్రడక్షన్.. ఇంతకీ యెల్లో కలర్ లో ఉన్న డోరేమాన్ బ్లూ కలర్ లో ఎలా మారాడు.. రోబో ఫ్యాక్టరీలో ఒక పనికిరాని మర బొమ్మ నోబిత దగ్గరకు ఎలా చేరింది అన్నది తుపాకి.కామ్ ఎక్స్ క్లూజివ్ డోరేమాన్ సీరీస్ పార్ట్ 2లో తెలుసుకుందాం.