Begin typing your search above and press return to search.

బెల్లంకొండ బాబు ఏమాత్రం తగ్గడే..!

By:  Tupaki Desk   |   31 July 2019 5:30 PM GMT
బెల్లంకొండ బాబు ఏమాత్రం తగ్గడే..!
X
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో 'రాక్షసుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ తమిళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా ఈ 'రాక్షసుడు' తెరకెక్కడంతో ఈ సినిమా విజయంపై శ్రీనివాస్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొదటి నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ అంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రెస్. బడ్జెట్.. హీరోయిన్లు.. టెక్నిషియన్స్.. ప్రమోషన్స్ అంతా హైఫై గా ఉంటాయి. ఈ సినిమాకు మిగతా విషయాల్లో ఏమో కానీ ప్రమోషన్స్ విషయంలో అదే తరహాలో ఉన్నాయి.

రీసెంట్ గా అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక జెట్ విమానానికి వెనక 'ఆల్ ద బెస్ట్ 2 బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు టీమ్' అంటూ ఒక బ్యానర్ ను గాలిపటం తోక లాగా ఎగరేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ప్రమోషన్స్ సహజంగా సూపర్ స్టార్ల సినిమాలకు జరుగుతాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు జరిగాయి అంటే.. అక్కడే ఉంది కిటుకు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నీ మాస్ మసాలా ఎంటర్టైనర్లు. ఈ తరహా చిత్రాలను ఓవర్సీస్ ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోరు. బెల్లకొండ సినిమాలపై తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి వ్యక్తం అవుతుంది కానీ ట్రంపుల్యాండు వాసులు అసలు పట్టించుకోరు. అయితే ఈసారి 'రాక్షసుడు' థ్రిల్లర్ సినిమా.. అక్కడివారికి నచ్చే కంటెంట్ ఉంది కాబట్టి వారి దృష్టిని ఆకర్షించేందుకు అలా ప్లాన్ చేశారన్నమాట. ఇదొక్కటే కాకుండా అమెరికాలోని పలు నగరాల్లో ఈ తరహా విమానాల ప్రమోషన్ కొనసాగుతుందట.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ 'రాక్షసుడు' ప్రమోషన్ భారీ స్థాయిలో జరుగుతోంది. బెల్లకొండ బాబు సినిమాల్లో భారీతనం.. హంగామా ఉంటుంది కానీ ఇంతవరకూ ఆయనకు నిఖార్సైన హిట్ ఒక్కటి కూడా తగలలేదు. మరి ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందా అనేది వేచి చూడాలి.