Begin typing your search above and press return to search.

బసవతారకం వెనుక ఇంత కథ ఉందా.?

By:  Tupaki Desk   |   19 July 2018 10:40 AM GMT
బసవతారకం వెనుక ఇంత కథ ఉందా.?
X
ఎన్టీఆర్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూలపురుషుడు.. సినిమాల్లో వెలుగు వెలిగి అనంతరం రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడాయన.. అంతటి మహానుభావుడి జీవిత చరిత్రను చాటిచెప్పాలని ఆయన కుమారుడు బాలక్రిష్ణ కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో సాగుతోంది.

ఎన్టీఆర్ జీవితంలో ఆయన భార్య బసవతారకం పాత్రకు చాలా ప్రాముఖ్యం కలది. ఆమె గురించి బయట జనాలకు తెలిసింది చాలా తక్కువ.. ఎప్పుడు ఎన్టీఆర్ విజయాలను మాత్రమే అందరూ చూశారు. కానీ దాని వెనకుండి అన్నీ తానై నడిపించిన బసవతారకం కష్టాలను మాత్రం చూడలేదు. ఇప్పుడు బాలయ్య తన తల్లి బాసవతారకం గొప్పతనాన్ని చాటేందుకు రెడీ అయ్యారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రకు విద్యాబాలన్ ను తీసుకోవడం వెనుక స్టార్ వాల్యూ మాత్రమే కాదు.. దాని వెనుక బలమైన పాత్రస్వభావం ఉందని నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.. ఎన్టీఆర్ పెళ్లి అయిన రోజుల గురించి వివరిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితం ఇంత గొప్ప విజయాలు సాధించడం వెనుకున్నది బసవతారకం ఉందని వారు చెబుతున్నారు. మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ పెళ్లైనప్పుడు ఓ సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తున్నాడట.. కానీ ఆ ఉద్యోగంలో సంతృప్తి చెందక సినిమాల్లో చాన్సుల కోసం ప్రయత్నిస్తానని బసవతారకంతో అన్నాడట.. భర్త నిర్ణయానికి మద్దతుగా నిలిచి ఏకంగా తన వడ్డాణం అమ్మి మరీ ఆ డబ్బులతో ఎన్టీఆర్ ను చెన్నైకి పంపించిందట బాసవతారకం.. సినిమాల్లో బిజీ అయిన తర్వాత 12 మంది సంతానాన్ని సమర్థంగా పెంచుకుంటూ ఎంతో నేర్పుతో - ఓర్పుతో పెంచి పెద్ద చేసిందట.. ఎన్టీఆర్ సినిమాలు - రాజకీయాల్లో బిజీగా ఉంటే కుటుంబ బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకుందట బాసవతారకం.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో సమానంగా ఎన్నో సృశించని నిజాలు బసవతారకం పాత్రలో ఉన్నాయట.. అవి చూపించాలంటే చాలా సీనియర్ - అనుభవం గల నటి కావాలని చిత్రం యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సీనియర్ నటి ‘విద్యాబాలన్’ పేరును క్రిష్ ప్రతిపాదించాడు. దీంతో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ను నటింపచేసేందుకు ఏకంగా బాలయ్యనే ఆమె ఇంటికి వెళ్లి కథ వినిపించి మరీ ఒప్పించాడట..

ఈ క్యారెక్టర్ విన్న వెంటనే విద్యాబాలన్ ఈ రోల్ చేయడానికి ఒప్పుకుందట.. అంతేకాదు.. బాసవతారకంకు అలవాటున్న హార్మోనియం ను కూడా విద్యాబాలన్ ప్రస్తుతం నేర్చుకుంటుందట.. అలా విద్యాబాలన్ లాంటి అగ్రహీరోయిన్ బసవతారకం పాత్రలో ఎలా నటిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.