Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ పై రాళ్ల వర్షం

By:  Tupaki Desk   |   30 Sep 2019 9:20 AM GMT
బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ పై రాళ్ల వర్షం
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ చాలా విభిన్నంగా సాగుతోంది. ప్రతి వారం కూడా వెరైటీగా ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ చేస్తున్న బిగ్‌ బాస్‌ ఈవారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ కూడా చాలా విభిన్నంగా ప్లాన్‌ చేశాడు. గత సీజన్‌ లలో ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చని వారిని ఎలిమినేట్‌ చేసేందుకు నామినేట్‌ చేసే వారు. కాని ఈసారి ఎక్కువ శాతం విభిన్నంగా ఈ పక్రియ సాగుతోంది.

నిన్న రవి ఎలిమినేట్‌ అయ్యి పోగా ఈ వారం ఎలిమినేషన్‌ కోసం నేటి ఎపిసోడ్‌ లో రాళ్ల వర్షం టాస్క్‌ ను ఇంటి సభ్యుల కోసం బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. ఇంట్లోకి పై నుండి రాళ్లు పడుతూ ఉంటాయి. ఆ రాళ్లపై వాటి ఖరీదు ఉంటుంది. ఆ రాళ్లను ఎక్కువగా దక్కించుకుని.. వాటిపై ఉన్న మొత్తంను కూడితే ఎవరికి ఎక్కువగా ఉంటే వారు సేవ్‌ అవుతారు. ఎవరికి తక్కువ ఉంటే వారు ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతారు.

బజర్‌ మోగే సమయానికి ఎవరి వద్ద తక్కువ ఉంటే వారే నామినేట్‌ అయినట్లుగా బిగ్‌ బాస్‌ చెప్పడంతో రాళ్ల కోసం కంటెస్టెంట్స్‌ కొట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఈవారం శ్రీముఖి కెప్టెన్‌ అయినందు వల్ల ఆమెకు ఈ టాస్క్‌ నుండి ఉపశమనం లభించింది. నేటి ఎపిసోడ్‌ లో ఎవరు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతారనేది చూడాలి. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉన్నారు. వారిలో శ్రీముఖికి ఇమ్యూనిటీ లభించగా ఉన్న 8 మందిలో ఎవరు నామినేట్‌ అవుతారు.. వీకెండ్‌ లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి