Begin typing your search above and press return to search.
హీరో ఉరి మరవక ముందే 27వ అంతస్తు నుంచి దూకి!
By: Tupaki Desk | 24 Jun 2020 10:30 AM ISTరియల్ ఎస్టేట్.. సినిమా రంగం.. సంగీతంలో డీన్ గా వ్యవహరించే సంస్థ `షాంగ్రి-లా` వ్యవస్థాపకుడు అయిన అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వ్యాపారవేత్త స్టీవ్ బింగ్ అమాంతం తన భవంతి 27వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లాస్ ఏంజిల్స్ సెంచరీ సిటీలో ఉన్న తన విలాసవంతమైన 27 వ అంతస్తు అపార్ట్ మెంట్ నుండి దూకారు. ఇక సుశాంత్ తరహాలోనే సదరు చిత్ర నిర్మాత నిరాశ నిస్ప్రహలకు లోనవ్వడం వల్లనే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. స్టీవ్ తనతో మాట్లాడే సహచర స్నేహితులు లేనందున నిరాశకు గురయ్యాడు. పైగా కరోనా-వైరస్ ప్రేరేపిత లాక్-డౌన్ కారణంగా అతని రోజు వారీ జీవితం లో మానవ మాతృడే కనిపించలేదట.
55 వయస్సులో ఆయన స్వర్గపు నివాసానికి చేరాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి జన్మించిన నటి ఎలిజబెత్ హర్లీ - అతని కుమార్తె కిరా బోండర్ మాజీ టెన్నిస్ క్రీడా కారిణి లిసా బోండర్ తో నివాసం ఉన్నారు. దివంగత నిర్మాత చాలా చిన్న వయస్సులోనే విజయాలు అందుకుని సంపదల్ని సృష్టించారు. లైఫ్ ని ఎంజాయ్ చేశారు. అంతేకాదు.. అతను తన తాత లియో ఎస్. బింగ్ నుండి 600 మిలియన్ల డాలర్ల వారసత్వ ఆస్తిని పొందాడు. సినీ నిర్మాణం సహా రియల్ ఎస్టేట్ లో బాగా ఆర్జించాడు.
`కంగారూ జాక్` (2003) అనే హాలీవుడ్ చిత్రానికి సహ-రచన చేసినందుకు .. ఆ మూవీ స్క్రీన్ ప్లేలో ఆయన చేసిన కృషికి అతడి పేరు పాశ్చాత్య దేశాల్లో మార్మోగింది. అతను ది పోలార్ ఎక్స్‌ప్రెస్ అనే యానిమేటెడ్ మూవీతో సహా పలు ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాడు. దీనిలో అతను 80 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడు. తరువాత ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద 5285 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించి విజయవంతమైంది. అతను 2017 చిత్రం బేవుల్ఫ్.. రోలింగ్ స్టోన్ కచేరీలో కూడా పెట్టుబడి పెట్టాడు. జెర్రీ లీ లూయిస్ ఆల్బమ్ `లాస్ట్ మ్యాన్ స్టాండింగ్`ను నిర్మించాడు. ఆయన మరణంతో హాలీవుడ్ ఖంగు తింది. పరిశ్రమకు చెందిన చాలా మంది అభిమానులు.. సమకాలీనులు ఈ సందర్భంగా నివాళులర్పించారు.