Begin typing your search above and press return to search.
దుమ్ము రేపుతున్న పవన్ లుక్
By: Tupaki Desk | 12 March 2023 1:31 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు... కానీ బీజేపీ, తెలుగుదేశం కూటమికి ఆయన మద్దతు పలికారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ సీట్లు మాత్రం గెలవలేకపోయారు. కేవలం జనసేనకు ఒకే ఒక సీట్లు లభించింది. కానీ ఇప్పుడు ఆ ఎంఎల్ఏ కూడా జనసేనకు దూరంగా ఉంటున్నారు.
అయితే మార్చి 15వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి గన్నవరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రత్యేక విమానంలో పెడుతూ ఆయన కూర్చున్న ఫోటోని జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆలివ్ గ్రీన్ ప్యాంట్ ధరించిన ఆయన బ్లాక్ టీ షర్ట్ కళ్లద్దాలు పెట్టుకుని యుద్ధానికి వెళుతున్న యోధుడిలా కనిపిస్తున్నాడు.
నేను రెడీ జన సైనికులారా మీరు రెడీ అంటూ క్యాప్షన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ లుక్ ఏదైనా సినిమా కోసమా లేక సాధారణంగా రెడీ అయి వచ్చేసారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వరుస సినిమాలో లైన్లో పెట్టారు. వరుస షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి ఆయన సముద్రఖని దర్శకత్వంలో తెరెక్కితున్న తమిళ వినోదయ సీతమ్ రీమిక్స్ సినిమాలో నటిస్తూనే ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు వంటి సినిమాల షూటింగ్స్ లో కూడా భాగం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికల్లో పూర్తిస్థాయిలో జనసేనను సంసిద్ధం చేయాలని భావిస్తున్న ఆయన పూర్తిగా సినిమాలన్నీ కంప్లీట్ చేసి రాజకీయాల మీదే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మీద ఉన్న పార్టీ టైం పొలిటిషియన్ అనే మరక తొలగించుకునేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.