Begin typing your search above and press return to search.

2016లో వీళ్లు మిస్సయ్యారే..

By:  Tupaki Desk   |   11 Dec 2016 3:30 AM GMT
2016లో వీళ్లు మిస్సయ్యారే..
X
డేట్స్.. కాల్షీట్స్ తో నడిచే సినీ ఇండస్ట్రీలో ప్రతీ నిమిషం కీలకమే. అందుకే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొన్నా ఓ సినిమా తర్వాత మరో సినిమా అంటూ వరస ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకోని ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తుంటారు హీరోలు.. దర్శకులు. కానీ ఒక్కోసారి అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అలాంటప్పుడు పూర్తిగా కనిపించడం మానేస్తారు. 2016లో అలా కొంతమంది స్టార్ హీరోలు.. పేరున్న డైరెక్టర్లు ఆడియెన్స్ కి బొత్తిగా టచ్ లో లేకుండా పోయారు.

అలా అస్సలు కనిపించని వాళ్లలో ఫస్ట్ పేరు- ప్రభాస్ దే. బాహుబలి తర్వాత మళ్లీ పలకరించలేదు ప్రభాస్. పార్ట్ వన్ ఎండింగ్ లో రాజమౌళి ప్రామిస్ చేసిన ప్రకారమైతే ఈ ఏడాదే బాహుబలి2 కూడా వచ్చేయాలి. కానీ అనుకోకుండా లేటైపోయింది. దీంతో బాహుబలి టూ కూడా కంప్లీట్ చేసి... ఆ సముద్రం నుంచి బయటికొచ్చిన తర్వాతే మరో మూవీ చేస్తానని ప్రభాస్ ఫిక్సవడంతో 2016లో ప్రభాస్ సినిమా జాడ లేకుండా పోయింది.

ఇక హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే హీరోల్లో ముందుంటాడు రవితేజ. అలాంటి రవితేజ కూడా 2016లో అడ్రస్ లేడు. బెంగాల్ టైగర్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాడని వినిపించినప్పటికీ అవి సినిమాలుగా మారలేదు. దీంతో ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయకుండానే 2016కి టాటా చెప్పేస్తున్నాడు ఈ మాస్ మహారాజ్. ఇటు గోపీచంద్ కూడా అంతే. సౌఖ్యం తర్వాత మళ్లీ ఏ మూవీలో కనిపించలేదు. అయితే గోపీచంద్ పెండింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వర్క్సన్నీ 2016లో జరుగుతున్నాయ్. సో 2017లో ఈ హీరో 3 సినిమాలతో తన కెరీర్ కి ఆక్సిజన్ ఇచ్చుకోడానికి రెడీ అవుతున్నాడు.

అఖిల్ తో అద్భుతాలు చేస్తాడనుకుంటే ఆ మూవీ రిజల్ట్ తో డీలా పడ్డాడు అక్కినేని కుర్రహీరో. రెండో మూవీకి అతి జాగ్రత్తలు ఎక్కువయ్యే సరికి 2016లో అసలు సినిమా లేకుండానే క్లోజ్ చేశాడు అఖిల్. అయితే ఎంగేజ్మెంట్ తో వార్తల్లో ఉండటమే ఈ ఇయర్ ఈ హీరో కెరీర్లో జరిగిన డెవలప్మెంట్ అనుకోవాలి. a