Begin typing your search above and press return to search.

మొదలవుతున్న ‘ఆదిపురుష్’.. ప్రభాస్ లేడటగా!

By:  Tupaki Desk   |   14 Jan 2021 12:30 PM GMT
మొదలవుతున్న ‘ఆదిపురుష్’.. ప్రభాస్ లేడటగా!
X
అనౌన్స్ తోనే పాన్ ఇండియా ప్రేక్షకులను అలర్ట్ చేసిన మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రవుత్ డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. రావణ్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ లెేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఆ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యాం, తర్వాత ఆదిపురుష్, సలార్ చిత్రాలు కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించబోతున్నాయి.

అయితే.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్ లేకుండానే మొదలు కానుందట. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో.. ప్రభాస్ లేకుండానే ‘ఆదిపురుష్’ సినిమాను ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడట దర్శకుడు.

రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్.. దాని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సలార్’ సినిమా లైన్‌లో ఉంది. ఈ చిత్రంతోపాటే ‘ఆదిపురుష్’ కూడా చేయనున్నాడు రెబల్ స్టార్. అయితే.. కరోనా వల్ల రాధేశ్యామ్ ఆలస్యం కావడంతో త్వరగా దాన్ని కంప్లీట్ చేసి, మిగిలిన ప్రాజెక్టుల్లో జాయిన్ కావాలని చూస్తున్నాడట.

ఇంత బిజీ షెడ్యూల్లో ‘ఆదిపురుష్’ ప్రారంభానికి ప్రభాస్ అందుబాటులో ఉండే అవకాశం లేదట. దీంతో.. అతను లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేసి, ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిశ్చయించుకున్నాడట డైరెక్టర్. రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తోపాటు ఇతర సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఆ విధంగా ప్రభాస్ లేకుండానే సినిమా స్టార్ట్ కాబోతోంది.