Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య‌! కింగ్ ఖాన్ బ‌ర్త్ డే పార్టీతో మొద‌లు!!

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:48 AM GMT
హ‌మ్మ‌య్య‌! కింగ్ ఖాన్ బ‌ర్త్ డే పార్టీతో మొద‌లు!!
X
బాద్ షా షారుక్ ఖాన్ కి స‌న్ స్ట్రోక్ అంతా ఇంతా కాదు! త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ జైలుకు వెళ్ల‌డం తో చాలా కుంగుబాటుకు లోన‌య్యాడు. ఆ గాయం నుంచి షారూక్ ఆర్య‌న్ ఇద్ద‌రూ ఇప్ప‌డిప్పుడే కోలుకుంటున్నారు. కుమారుడు డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అవ్వ‌డం..అటుపై జైలు లో ఉండ‌టం..బెయిల్ విష‌యంలో జాప్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షారుక్ కి గ‌త నెల రోజులో గా కంటి మీద కునుకులేకుండా పోయింది. మ‌రోవైపు ప్ర‌ముఖుల ప‌రామ‌ర్శ‌లు ..ఓదార్పుల‌తో షారుక్ అన్నిటికీ అశువు అయిపోయాడు. ఎక్క‌డి షూటింగ్ లు అక్క‌డ నిలిపివేసి కుమారుడిని వీలైనంత‌ త్వ‌ర‌గా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా ఎన్.సి.బి త‌గ్గ‌క‌పోవ‌డంతో అది కాస్తా ఆల‌స్యంమైంది. ఇలా షారుక్ నెల రోజులుగా మ‌న‌సు ప్ర‌శాంతంగా లేకుండానే ఉన్నారు.

చివ‌రికి ఎలాగూ ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌డంతో ఊపిరి తీసుకున్నాడు. గాయం నుంచి బ‌యట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 2 న షారూరుక్ పుట్టిన రోజు కూడా వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో పార్టీ మోడ్ లోకి వెళ్ల‌నున్న‌ట్టు క‌నిపిస్తోంది. అమీర్ ఖాన్..ర‌ణ‌బీర్ క‌పూర్..ర‌ణ‌వీర్ సింగ్.. క‌ర‌ణ్ జోహార్.. అలియాభ‌ట్..దీపికా ప‌దుకొణే అంతా ఒకే చోట చేరి గెట్ టు గెద‌ర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. షారుక్ ఫుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసారి మునుపెన్న‌డూ లేనంత‌గా అంద‌రినీ స‌మీక‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. స్టార్లంతా ముందస్తుగా ఖాన్ ఆతిథ్యానికి హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈసారి వేడుక‌ల‌కు షారుక్ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నా..స్నేహితులు అందుకు ఒప్పుకున్న‌ట్లు లేదు.

అందుకే వాళ్లంతా క‌లిసి షారుఖ్ మ‌న్న‌త్ కి వెళ్లి అక్క‌డే అత‌డితో ఎక్కువ స‌మ‌యం గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా వీళ్లంతా క‌లిసి ఫోటో దిగారు. షారూక్‌- అమీర్ -ర‌ణ‌బీర్- ర‌ణ‌వీర్ - దీపిక- ఆలియా స‌హా ప‌లువురితో గ్రూఫ్ ఫోటో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇక షారుక్ సినిమాల‌పై కూడా దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్నాడు. కొద్ది భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. తిరిగి యాథావిథిగా ఆ సినిమా షూటింగ్ ప్రారంభించ‌డానికి షారుక్ రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.