Begin typing your search above and press return to search.

రజినీకాంత్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేస్తారట?

By:  Tupaki Desk   |   21 Sept 2020 11:45 AM IST
రజినీకాంత్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేస్తారట?
X
సూపర్ స్టార్ రజినీ కాంత్ కరోనా ను దాటుకొని షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం లో రజినీ కాంత్ 168వ సినిమా చేస్తున్నారు. ఆయన ఎప్పుడు రంగంలోకి దిగుతాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే కరోనాతో ఆగిపోయిన ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అసలు ఈ ఏడాది షూటింగ్ మొదలు పెడుతారా లేదా అన్నది రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా లో బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే రజినీకాంత్ వయసు 60 దాటిపోయింది. దీంతో వయసు రీత్యా ఇప్పట్లో రజినీ కాంత్ బయటకు రాకపోవచ్చు అని ఆయన ఆరోగ్యం దృష్ట్యా దర్శకులు కూడా సాహసం చేయకపోవచ్చని అంటున్నారు

తాజాగా అప్ డేట్ ప్రకారం నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. రజినీ లేని సీన్స్ ను ముందుగా తీస్తారని.. ఈ సీన్స్ పూర్తయ్యాక మళ్లీ షూటింగ్ గ్యాప్ ఇచ్చి వచ్చే ఏడాది షూటింగ్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది.

యాక్షన్ డైరెక్టర్ శివతో ఈ మూవీ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి. మాస్ సినిమాలు తీయడంలో శివ దిట్ట. దీంతో రజినీకాంత్ కొత్త సినిమాపై ఫుల్ హైప్ ఏర్పడింది.