Begin typing your search above and press return to search.

NCB విచార‌ణ‌కు కౌంట‌ర్ గానే.. క‌ర‌ణ్ మిడ్ నైట్ పార్టీ?

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:06 AM GMT
NCB విచార‌ణ‌కు కౌంట‌ర్ గానే.. క‌ర‌ణ్ మిడ్ నైట్ పార్టీ?
X
ఇటీవ‌లే బాలీవుడ్ డ్ర‌గ్ దందాలో ఎన్.సి.బి విచార‌ణ అట్టుడికించిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్ని ఎన్సీబీ విచారించింది. ఆ క్ర‌మంలోనే 2019 క‌ర‌ణ్ జోహార్ పార్టీ వీడియో హాట్ టాపిక్ అయ్యింది. దానిపై విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే క‌ర‌ణ్ ఆ డిమాండ్ల‌కు ఎక్క‌డా త‌లొగ్గ‌లేదు. పార్టీలో త‌ప్పుడు ప‌నులేవీ చేయ‌లేద‌ని వివ‌రణ ఇచ్చాక‌.. అస‌లు ఆ ఉదంతాన్నే అత‌డు ప‌ట్టించుకున్న‌ట్టు లేదు.

లేటెస్టుగా క‌ర‌ణ్ జోహార్ 2020 మిడ్ నైట్ పార్టీ బాలీవుడ్ స‌హా దేశ‌వ్యాప్తంగా అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ పార్టీలో క‌ర‌ణ్ ప‌రిచ‌యం చేసిన న‌ట‌వార‌సులు .. అలానే ప‌లువురు స్టార్ హీరోయిన్లు కూడా మెరుపులు మెరిపించారు. క‌ర‌ణ్ ఇంట జ‌రిగిన పార్టీ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. పార్టీ లోపలి ఫోటోల్లో కత్రినా కైఫ్.. అనన్య పాండే.. విక్కీ కౌషల్ .. జోయా అక్తర్.. కబీర్ ఖాన్ .. మినీ మాథుర్ త‌దిత‌రులు ఈ పార్టీలో ఉన్నారు.

తెల్లవారుజామున 2:30 గంటలకు కరణ్ ఇంటి నుండి స్టార్లు బయలుదేరుతున్నప్పుడు క్లిక్ చేసిన ఫోటోల్లో అనన్య పాండే బ్లాక్ స్లీవ్ లెస్ టీలో ప్రకాశవంతంగా కనిపించింది. ఈ క్యూటీ 240 W చిరునవ్వు ఇటు ఫైట‌ర్ టీమ్ స‌హా టాలీవుడ్ స‌ర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు ఎర్రటి టీ ష‌ర్ట్ ధరించిన కత్రినా కైఫ్.. ఏదో మిస్స‌యిన‌ట్టు ఆలోచిస్తూ క‌నిపించింది. ఇంతలో జోయా అక్తర్ తన ఫోన్ కోసం వెతుక్కూంటూ క‌నిపించారు. సింపుల్ హూడీ ధరించి విక్కీ కౌషల్ చిరునవ్వు అతని ముసుగు వెనుక కూడా స్పష్టంగా కనిపించింది.

కబీర్ ఖాన్ .. మినీ మాథుర్ స‌హా అందరూ నవ్వుకుంటూ క‌నిపించారు. ఇది మిడ్ నైట్ పార్టీనా? లేక సాధా సీదా మీటింగ్ మాత్ర‌మేనా? అన్న‌దానికి అట్నుంచి ఆన్స‌ర్ రావాల్సి ఉంటుంది.