Begin typing your search above and press return to search.
మరోసారి ఓటీటీ బాట పడుతున్న స్టార్స్
By: Tupaki Desk | 19 May 2021 7:00 PM ISTహాలీవుడ్ లో స్టార్ లు సూపర్ స్టార్ లు గత కొన్నాళ్లుగా ఓటీటీ కంటెంట్ లో నటిస్తున్నారు. కాని ఇండియాలో మాత్రం కరోనా వల్ల ఓటీటీ మార్కెట్ పెరిగింది.. స్టార్స్ ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూత పడి ఉన్న నేపథ్యంలో స్టార్ హీరోలు తాము థియేటర్ల ద్వారా రావాలనుకుని చేసిన సినిమాలను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేని కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద సినిమా లు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ లో పలు సినిమా లు ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి. పరిస్థితులు చక్క బడ్డాయి. ఇక మళ్లీ థియేటర్ల రిలీజ్ కు సిద్దం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది.
బాలీవుడ్ లో పలు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యాయి. ఇటీవలే రాధే సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేశారు. పే పర్ వ్యూ పద్దతిన విడుదల చేసిన రాధే సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో ఇతర సినిమా లు కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. అందులో కొన్ని స్టార్ హీరోల మరియు హీరోయిన్స్ సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలో విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన షేర్నీ సినిమా ను కూడా ప్రైమ్ ద్వారా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారట.
రాధే సినిమా ను జీ5 ద్వారా స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. ఇక షేర్ని సినిమాను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను విద్యాబాలన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసింది. గత ఏడాది ఈమె చేసిన శకుంతలాదేవి సినిమా కూడా ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. షేర్నితో పాటు మరి కొన్ని సినిమాలు కూడా త్వరలో ఓటీటీ బాట పట్టే అవకాశం ఉందట. టాలీవుడ్ లో మాత్రం చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి తప్ప.. స్టార్ హీరోలు మాత్రం ఓటీటీ ద్వారా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.