Begin typing your search above and press return to search.

ఏడ్వాల్సింది నిర్మాత‌లు కానీ హీరోలేడుస్తారేం?

By:  Tupaki Desk   |   17 May 2020 5:00 AM IST
ఏడ్వాల్సింది నిర్మాత‌లు కానీ హీరోలేడుస్తారేం?
X
క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల సినీప‌రిశ్ర‌మ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి. అప్ప‌టికే సిద్ధంగా ఉన్న సినిమాల్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకోలేని ధైన్యం నెల‌కొంది. క‌రోనా ఇంకో ఏడాది పాటు ఇలానే ఉంటుంద‌ని ప్ర‌భుత్వాలే క్లారిటీ ఇచ్చేస్తుంటే ఇక థియేట‌ర్లు తెరుచుకునే సీనుంటుందా? ఇదే నిర్మాత‌ను నిలువ‌నీయ‌డం లేదు. ఇప్ప‌టికే ఫైనాన్సులు తెచ్చి వ‌డ్డీలు క‌డుతున్న వాళ్లంతా బెంబేలెత్తి పోతున్నారు. ఆ క్ర‌మంలోనే ఆల్ట‌ర్నేట్ గా అందుబాటులో ఉన్న ఓటీటీ-డిజిట‌ల్ వైపు చూస్తున్నారు.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ కి త‌మ సినిమాల్ని విక్ర‌యిస్తున్నారు. త‌మిళ స్టార్ హీరో సూర్య స‌హా అటు బాలీవుడ్ లో అమితాబ్ - ఆయుష్మాన్ వంటి హీరోల సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండ‌డంతో మునుముందు తెలుగు హీరోలు కూడా అదే బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నా వెలువ‌డింది. అయితే చాలా కాలంగా అస‌లు తెలుగు హీరోలు ఎవ‌రూ ఓటీటీ అంటేనే స‌సేమిరా అంటూ మ‌న నిర్మాత‌ల ముందు వాపోతున్నార‌ని చెబుతున్నారు. కానీ స‌న్నివేశం చూస్తుంటే తెలుగు హీరోల ఆలోచ‌న‌ను మార్చుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

హిందీ సినిమాల్లో `గులాబో సితాబో` (బిగ్ బి) తొలిగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ ని.. అలాగే విద్యాబాల‌న్ న‌టిస్తున్న బ‌యోపిక్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం ఉంది. ఇంకా ప‌లు చిత్రాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే ఇలా త‌మ సినిమాలు ఓటీటీ వేదిక‌పైకి వ‌చ్చేస్తుంటే హీరోల్లో ఒక‌టే దిగులుగా ఉందిట‌. పె‌ద్ద తెర వీక్ష‌ణ‌ ఇచ్చినంత కిక్కు ఓటీటీలో ఇవ్వ‌ద‌నేది వీరి ఆందోళ‌న‌కు కార‌ణం. బాగా న‌టించినా అంత మంచి పేరొస్తుందా? అంటూ సందేహ ప‌డుతున్నార‌ట‌. అయితే వీళ్లంతా గుర్తించాల్సింది వేరొక‌టి ఉంది. జ‌నం థియేట‌ర్ల‌లో చూస్తేనే గొప్ప అని అనుకునే ప‌రిస్థితి ఇక‌పై ఉండ‌బోదు. ఓటీటీ అయినా బుల్లితెర అయినా ఎక్క‌డైనా కంటెంట్ ఉంటే ఆద‌రించే ప‌రిస్థితి ఉంటుంద‌న్న‌ది గుర్తెర‌గాలి. బాగా న‌టిస్తే గొప్ప‌గా చేశాడ‌ని పొగిడేస్తారు. చెత్త‌గా న‌టిస్తే అంతే ఇదిగా ట్రోల్ చేస్తారు కూడా.