Begin typing your search above and press return to search.

స్టార్ వైఫ్స్ దుమ్ము దుమారం

By:  Tupaki Desk   |   1 Jan 2019 5:46 AM GMT
స్టార్ వైఫ్స్ దుమ్ము దుమారం
X
కొత్త సంవ‌త్స‌రం సంబురాల్లో యువ‌త‌రం మునిగి తేల్తోంది. 31 మిడ్ నైట్‌ సంద‌డే సంద‌డి. అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మాల‌తో హోరెత్తించారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు దేశ‌, విదేశాల్లో సెల‌బ్రేష‌న్స్ రంజుగా సాగాయి. మ‌హేష్, రామ్ లాంటి స్టార్లు విదేశాలు వెళ్లి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. మ‌హేష్ ఈసారి దుబాయ్‌ కి వెళితే, రామ్ హాంకాంగ్ వెళ్లాడు. ఇంకా ప‌లువురు స్టార్లు విదేశాల్లో సెల‌బ్రేష‌న్ చేసుకున్నారు.

స్టార్స్ సెల‌బ్రేష‌న్స్ సెల‌బ్రేష‌న్స్ మాటేమిటి? అంటే ఇదిగో సంబురాలు ఈ రేంజులో ఉన్నాయి మ‌రి. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ మారిపోయింది. మ‌న స్టార్ వైఫ్స్ అంతా క‌లిసి పండ‌గ‌లు, ప‌బ్బాలు చేసుకోవ‌డం, క‌లిసి డిన్న‌ర్లు, లంచ్ లు చేయ‌డం ఫ్యాష‌న్ గా మారింది. ఒక‌రికొక‌రు అంతా ఇప్పుడు ట‌చ్ లోనే ఉన్నారు. ఫోన్ కాల్ అవేలో సెల‌బ్రేష‌న్స్ మోతెక్కిపోతున్నాయంతే.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య స్నేహం గురించి గుర్తు చేయాల్సిన ప‌నే లేకుండా ఇదిగో ఈ ఫోటోలో వారి స‌తీమ‌ణుల స్నేహం గురించే మాట్లాడాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది. ఉపాస‌నా రామ్ చ‌ర‌ణ్, ప్ర‌ణ‌తి రామారావు క‌లిసి కొత్త సంవ‌త్స‌రం వేళ ఇదిగో ఇలా సెలబ్రేష‌న్స్ లో మునిగి తేలారు. వీళ్ల‌తో క‌లిసి స్నేహితురాళ్లు కూడా అదే రేంజులో సెల‌బ్రేష‌న్స్ చేశారు. స‌తీమ‌ణుల‌ రేబాన్ క‌ళ్ల‌ద్దాలు ర‌ఫ్ఫాడించేశాయంతే. ఇటీవ‌లే రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుక‌కు చ‌ర‌ణ్ - తార‌క్ క‌లిసే వెళ్లారు. మ‌రి ఆ పెళ్లిలోనే భార్యామ‌ణులు ఇలా సంద‌డి చేశారా? లేక కొత్త సంవత్స‌రం సంబ‌రాల్లో ఇలా చిలౌట్ చేశారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.