Begin typing your search above and press return to search.

సౌందర్య గురించి పరుచూరి ఆసక్తికర పలుకులు

By:  Tupaki Desk   |   14 Feb 2020 4:00 AM IST
సౌందర్య గురించి పరుచూరి ఆసక్తికర పలుకులు
X
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌ లో పరుచూరి పలుకులు అనే కార్యక్రమంను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ కార్యక్రమంలో భాగంగా తన అనుభవం తాలూకు జ్ఞాపకాలను మరియు కొన్ని సినిమాల గురించి.. కొందరు సినీ ప్రముఖుల గురించి.. సినీ చరిత్రలో నిలిచి పోయే సంఘటనల గురించి వాటితో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ స్వర్గీయ స్టార్‌ హీరోయిన్‌ సౌందర్య గురించి పరుచూరి పలుకుల్లో చర్చించడం జరిగింది.

పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఆమె చేసిన వంద సినిమాల్లో మాకు ఆమెతో ఎనిమిది సినిమాలు మాత్రమే చేసే అవకాశం దక్కింది. ఆమెతో మొదట పని చేసినప్పుడు ఎలా ఉందో స్టార్‌ అయిన తర్వాత కూడా అలాగే ఉంది. పెద్దలు అంటే గౌరవం ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్‌ గా స్టార్‌ డం వచ్చి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆమె పెద్దల పట్ల చూపించే గౌరవంకు మేము ముగ్దులం అయ్యేవాళ్లం. ఒకానొక సమయం లో తాను ఒక రచయిత కూతురును అంటూ సౌందర్య చెప్పింది. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. ఒక రచయిత కూతురు ఈస్థాయిలో ఉండటం ఆనందాన్ని కలిగించింది.

సాదారణంగా హీరోయిన్‌ ను చూస్తే ఇలాంటి భార్య కావాలనిపిస్తుంది. కాని సౌందర్యను చూపించినప్పుడు నాకు ఇలాంటి చెల్లి ఉంటే బాగుండేది అనుకునేవాళ్లం. ఆమె ఒక మంచి మనసున్న వ్యక్తి అన్నాడు. తాను ఆమెతో ఆజాద్‌ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఒక స్టార్‌ హీరోయిన్‌. ఆ సమయంలో కూడా ఆమె మా పట్ల చూపించిన గౌరవంకు ఆశ్చర్యం వేసిందన్నారు.

నా తల్లి కోరిక అయిన ఉస్మానియా యూనివర్శిటీ లో నేను సాహిత్యం లో గౌరవ అందుకుంటున్న సమయం లో ఒక విలేకరి ద్వారా సౌందర్య హెలికాప్టర్‌ ప్రమాదం నాకు తెలిసింది. చాలా ఆనందకరమైన సమయంలో అలాంటి వార్త వినాల్సి రావడంతో అది నా జీవితంలో గుర్తిండి పోయేలా చేసింది.

అసలు సౌందర్య విమానంలో రావాల్సి ఉండగా.. ఆప్తమిత్ర షూటింగ్‌ ఆలస్యం అయ్యి విమానం టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చిందట. అత్యవసరంగా రావాల్సి ఉన్నందున ఆమె హెలికాప్టర్‌ లో బయలుజేరారు అని.. ఒక వేళ విమానంలోనే ఆమె వచ్చి ఉంటే బతికి ఉండేవారని పరుచూరి అన్నారు. ఒకవేళ సౌందర్య బతికి ఉంటే ఆమె అద్బుతమైన పాత్రు చేసి ఉండేదంటూ పరుచూరి పలుకుల్లో పేర్కొన్నారు.