Begin typing your search above and press return to search.
ఫ్లాప్ దెబ్బకు స్టార్ రైటర్ పై డైరెక్టర్ గుస్సా!
By: Tupaki Desk | 4 Oct 2020 12:40 PM ISTఓవర్ నైట్ లో ఫేట్ డిసైడ్ అయిపోతోంది. ఓటీటీ రిలీజ్ లపై జనం పెదవి విరుపులు బయటపడిపోతున్నాయి. బావుంటే పొగడ్తలే కానీ బావుండకపోతేనే వెంటనే సీన్ రివర్స్ అవుతోంది. ఇది ఊహించని పరిణామం. ఇంతకుముందు థియేట్రికల్ రిలీజ్ సమయంలో కనీసం రెండు మూడు రోజుల వరకూ అయినా సమయం ఉండేది. రివ్యూలు వచ్చినా థియేటర్లో చూసి తేల్చుకోవాలనే ఆలోచన స్టార్ల అభిమానులకు ఉంటే మూడు రోజులు హౌస్ ఫుల్స్ నడిచేవి. ఇప్పుడా సీన్ లేదు. ఓటీటీ రిలీజ్ లపై వెంటనే రివ్యూలు చదివేసి 3గంటల సమయం వృథా చేస్తూ.. మూవీ చూడాలా వద్దా? అన్నది ఆలోచిస్తున్నారు.
ఇటీవలే రిలీజైన ఓ ప్రయోగాత్మక థ్రిల్లర్ మూవీపై నెగెటివ్ రివ్యూలు హోరెత్తిన సంగతి తెలిసిందే. మూవీలో కంటెంట్ తేలిపోయిందని క్రిటిక్స్ విమర్శించారు. దీంతో ఫ్లాప్ తప్పలేదు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అన్నది విశ్లేషించిన చిత్రబృందం దర్శకత్వం టీమ్ అంతా స్టార్ రైటర్ నే తప్పు పట్టారని.. ఇప్పుడు సదరు సీనియర్ రైటర్ పై డైరెక్టర్ ఎదురు తిరిగారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను రాసుకున్న స్టోరీని యాజ్ టీజ్ తీసినా మూవీ ఇంత నీరసంగా అనిపించేది కాదని బ్యానర్ తరపు వాళ్లు వాదిస్తున్నారట. ఈ విషయంలో రైటర్ పై డైరెక్టర్ సహా నిర్మాతలు రివర్సయ్యారట. దర్శకరచయితల్నే ప్రస్తుతం చిత్రబృందం తప్పు పడుతుండడంతో ఆ ఇద్దరి మధ్యా రచ్చ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ మూవీలో ఇద్దరు కథానాయికలు ఉండడంతో ఎవరి పాత్రకు ఎంత ప్రాధాన్యతనివ్వాలి? అన్నదానిపైనా కన్ఫ్యూజన్ బయటపడిపోయింది. ఎవరి సినిమాలో ఎవరు నటించారు? అంటూ ఆ ఇద్దరు నాయికలపైనా పంచ్ లు పడిపోతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా హిట్టొస్తే ఇలాంటివేవీ బయటకు రావు. ఫ్లాపైతేనే ఇలా ముంచుకొస్తుంటాయి.