Begin typing your search above and press return to search.

'రాంచరణ్ - శంకర్' మూవీకోసం స్టార్ రైటర్!

By:  Tupaki Desk   |   11 March 2021 11:15 AM GMT
రాంచరణ్ - శంకర్ మూవీకోసం స్టార్ రైటర్!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయినప్పటి నుండి ప్రేక్షకులలో సినిమాపై ఎన్నో ఊహగానాలు క్రియేట్ అవుతున్నాయి. రాంచరణ్ కెరీర్లో 15వ సినిమాగా ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఆయన సినీప్రయాణంలో ఎన్నో గ్రేట్ సినిమాలు అందించిన శంకర్.. రాంచరణ్ తో సినిమా అనగానే సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ఎందుకంటే శంకర్ స్టామినా, విజన్ గురించి దేశవ్యాప్తంగా అందరికి తెలిసిందే. అయితే వీరి సినిమా పై సోషల్ మీడియాలో, సినీవర్గాలలో రోజులకొద్ది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే టాపిక్ పై పుకార్లు వినిపించాయి.

శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సందేశాత్మక అంశాలు కూడా ఉంటాయట. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే టాపిక్ పై సోషల్ మీడియాలో గాసిప్ ట్రెండ్ అవుతోంది. చరణ్ సరసన నటించబోయే యాక్ట్రెస్ సౌత్ కొరియాకు చెందిన సుజీబే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరో హీరోయిన్ కియారా అద్వానీ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అయితే మరి శంకర్ సినిమా అంటే పవర్ స్టోరీతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ కోసమే టాలీవుడ్ స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రాను ఓకే చేశారట మేకర్స్. ఆల్రెడీ కృష్ణంవందే జగద్గురుమ్ నుండి నిన్నటి క్రాక్ సినిమా వరకు తన స్టామినా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు సాయిమాధవ్. ఇప్పుడు శంకర్ సినిమా అంటే డైలాగ్స్ ఏ రేంజిలో ఉండాలో ఊహించలేం. ఈ భారీ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కాస్ట్ అండ్ క్రూ సెలక్షన్ జరుగుతుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.