Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: స‌్టార్ వార్స్ మ‌రో విజువ‌ల్ వండ‌ర్

By:  Tupaki Desk   |   22 Oct 2019 1:43 PM GMT
ట్రైల‌ర్ టాక్: స‌్టార్ వార్స్ మ‌రో విజువ‌ల్ వండ‌ర్
X
డిస్నీ సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే దానిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలుంటాయి. లుకా ఫిలింస్ భాగ‌స్వామ్యంలో డిస్నీ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం `స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాక‌ర్`. డీసీ సంస్థ నుంచి వ‌చ్చిన `అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్` త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి భారీ విజువ‌ల్స్ తో రాబోతున్న చిత్ర‌మిద‌ని తాజాగా రిలీజైన ఫైన‌ల్ ట్రైలర్ చెబుతోంది. అంతేకాదు.. అవెంజ‌ర్స్ త‌ర‌హాలోనే సెంటిమెంట్.. ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ప్రాధాన్య‌త‌తోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. స్టార్ వార్స్ సిరీస్ లోనే ఎమోష‌న‌ల్ కంటెంట్ ప‌రంగా హై పించ్ ఈ చిత్రంలో అభిమానులు చూడ‌బోతున్నారు.

ఇక ఇప్ప‌టివ‌ర‌కూ ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగించిన స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ C-3PO ఈ సినిమాతో ఎండ్ కాబోతోంద‌ని ఫైన‌ల్ ట్రైల‌ర్ చెబుతోంది. ఆ మెషిన‌రీ డ్రాయిడ్ రోల్ వైరింగ్స్ ని తొల‌గిస్తూ చెబుతున్న డైలాగ్ ఫ్యాన్స్ కి కంట త‌డి పెట్టిస్తోంది. `టేకింగ్ వ‌న్ లాస్ట్ లుక్ స‌ర్.. ఎట్ మై ఫ్రెండ్స్` అంటూ చెబుతున్న ఎమోష‌న‌ల్ డైలాగ్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక స్టార్ వార్స్ తాజా ట్రైల‌ర్ లో మునుప‌టి లానే భారీ విహంగాలు.. స్పేస్ షిప్ లు.. స‌ముద్రంలో సాహ‌సాలు వ‌గైరా వ‌గైరా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘంగా కొన‌సాగుతున్న‌ స్టార్ వార్స్ సిరీస్ కి ఎండ్ కార్డ్ ప‌డుతోందా? అందుకే ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ల‌న్నీ చ‌నిపోతున్నాయా? అంటూ తాజాగా అభిమానుల్లో డిబేట్ మొద‌లైంది. స్టార్ వార్స్- ది ఫోర్స్ అవేకెన్స్ చిత్రంలో ఫ్యాన్స్ ఎంతో ఎమోష‌న్ అయ్యే క్యార‌క్ట‌ర్ హాన్ సోలో (హ్యారిస‌న్ ఫోర్డ్) ఎండ్ అయ్యింది. స్టార్ వార్స్ - ది లాస్ట్ జేడీ చిత్రంలో లూక్ స్కై వాక‌ర్ (మార్క్ హ్యామిల్) కూడా మ‌ర‌ణించాడు. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్ర ఎండ్ అవ్వ‌బోతోంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ది స్కై వాక‌ర్ సాగా ఎండ్స్ అంటూ టైటిల్స్ లోనూ వేయ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది. మార్క్ హామిల్- కేరి ఫిష‌ర్ వంటి స్టార్ల పాత్ర‌లు ఎమోష‌న్ తో నిండి ఆక‌ట్టుకున్నాయి. ఇక ఇందులో లేడీ వారియ‌ర్ అప్పియ‌రెన్స్ తో ట్రైల‌ర్ ప్రారంభం అవ్వ‌డంతోనే లేడీ సెంటిమెంట్ ను బాక్సాఫీస్ క‌న‌క‌వ‌ర్షంగా మార్చుకునే ఆలోచ‌న క‌నిపిస్తోంది.

స్టార్ వార్స్ తో అనుబంధం ఉన్న‌ కేరి ఫిష‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ ట్రైల‌ర్ ని రిలీజ్ చేసింది లూకాస్- డిస్నీ ద్వ‌యం. డిసెంబ‌ర్ 20న క్రిస్మ‌స్ కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టార్ వార్స్ - ది రైజ్ ఆఫ్ స్కై వాక‌ర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అంత‌కంటే ముందే అమెరికా ఏఎంసీ థియేట‌ర్ల‌లో `స్టార్ వార్స్ మార‌థాన్` నేప‌థ్యంలో ఈ సినిమా ప్రివ్యూ ఉండ‌నుంది.