Begin typing your search above and press return to search.

స్టార్ సింగర్ గ్లామర్ షో.. ఇలా షాక్ ఇచ్చిందేంటి?

By:  Tupaki Desk   |   1 Feb 2023 9:00 AM GMT
స్టార్ సింగర్ గ్లామర్ షో.. ఇలా షాక్ ఇచ్చిందేంటి?
X
ఇండియాలో స్టార్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న గాయని నేహా బాసిన్. ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు టెలివిజన్ రియాలిటీషోలతో వెలుగులోకి వచ్చింది. 2015లో హిందీ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ చాల తక్కువ టైంలో స్టార్ సింగర్ గా మారిపోయింది. తెలుగులో కూడా స్వింగ్ జర సాంగ్ తో భాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు కరెంట్ సినిమాలో ఇటు నువ్వే అటు నువ్వే అంటూ మేలోడీ సాంగ్ తో ప్రేక్షకులకి చేరువ అయ్యింది.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ బ్యూటీని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. దేవిశ్రీ సినిమాలకి నేహా బాసిన ఎక్కువగా తెలుగులో పాటలు పాడటం విశేషం. ఇక హిందీలో కూడా చాలా హిట్స్ సాంగ్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి.

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డులని కూడా గట్టిగానే సొంతం చేసుకున్న ఈ అమ్మడు తన సింగింగ్ టాలెంట్ తో ఎంత పాపులర్ అయ్యిందో అదే స్థాయిలో అందాల ప్రదర్శన ద్వారా ఫేమస్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సింగర్స్ తో ఎక్కువ మంది ఫాలోవర్స్ నేహా బాసిన్ కి ఉంటారని చెప్పొచ్చు.

దీనికి కారణం అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా స్వీచ్చగా తనకి నచ్చిన కాస్ట్యూమ్స్ తో రెచ్చిపోతుంది. హాట్ హాట్ అందాలు చూపించడానికి ఏ మాత్రం సంకోచించదు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని దేహ సౌందర్యంతో మెరిసిపోయే నేహా బాసిన్ అప్పుడప్పుడు మోడలింగ్ కూడా చేస్తుంది.

హాట్ ఫోటోషూట్ లతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె తన ఫాలోవర్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఎద అందాలు కనిపించే విధంగా ఫుల్ మోడరన్ డ్రెస్ లో ఒక షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ వీడియోలో థైస్ తో పాడు క్లీవేజ్ షో చేస్తూ రొమాంటిక్ గా రెచ్చిపోయింది. ఇక ఆ వీడియోకి ఆసక్తికరమైన కొటేషన్ కూడా రాసుకొచ్చింది. నిధుల కోసం ఈ ప్రపంచంలో అందరూ వెదుకుతారు. కాని ఆ నిధులు మనలోనే ఉంటాయి అంటూ తన దేహ సౌందర్యాన్ని వర్ణిస్తూ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోకి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.