Begin typing your search above and press return to search.

తమ స్టాఫ్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ వాక్సినేషన్ డ్రైవ్..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 2:30 PM GMT
తమ స్టాఫ్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ వాక్సినేషన్ డ్రైవ్..!
X
కరోనా సమయంలో సామాన్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు సినీకార్మికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎవరికీ వారే కరోనా డ్రైవ్స్ నిర్వహిస్తూ వాక్సినేషన్ చేయిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో వెళుతున్నాడు ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తాజాగా దిల్ రాజు కూడా త్వరలో కరోనా వాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే తెలుగు సినీ నిర్మాతల మండలి షూటింగ్స్ ప్రారంభించాలి అనుకునే చిత్రబృందాలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. అందులో ఒకటి కోవిడ్ వాక్సిన్.

అయితే మండలి సూచనల మేరకు ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తన ప్రొడక్షన్ లో తన సినిమాల కోసం పనిచేసే సిబ్బంది - వ్యక్తిగత సిబ్బంది - ఆఫీస్ స్టాఫ్ అందరికి కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసాడట. ఇందుకోసమే హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకొని టీకా ప్రోగ్రాం నిర్హహిస్తారని సమాచారం. ఆల్రెడీ దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి తమ ప్రొడక్షన్ హౌస్ స్టాఫ్ అంటే సుమారు 200మందికి వాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయంశంగా మారింది. ఇలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ తమ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే సిబ్బందికి తామే వాక్సిన్ ఇప్పిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

వాక్సినేషన్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇండస్ట్రీతో పాటు సినీ కార్మికులకు కూడా చాలా ప్రయోజనకంగా ఉంటుంది. మరి ముందు ముందు మరికొందరు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ముందుకు వస్తారని ఇండస్ట్రీ వర్గాలలో ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇకపై షూటింగ్ సమయంలో కూడా కరోనాకు సంబంధించి పర్ఫెక్ట్ ప్రోటోకాల్ పాటించాలని తెలుగు నిర్మాతల మండలి సూచించింది. దిల్ రాజు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా లాక్డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ వీలైనంత త్వరగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం దిల్ రాజు రాంచరణ్ 15వ సినిమాతో పాటు హిందీలో జెర్సీ రీమేక్.. శాకుంతలం సినిమాలను నిర్మిస్తున్నాడు.