Begin typing your search above and press return to search.
క్రేజీ స్టార్ నే లైట్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్?
By: Tupaki Desk | 28 Jan 2023 9:00 PM GMTపిలిచి పిల్లనిస్తానంటే వెనకటికి ఎవరో ఏదో అన్నారట అన్నట్టుగా వుంది టాలీవుడ్ లో ఓ స్టార్ ప్రొడ్యూసర్ పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా టాలీవుడ్ లో క్రేజీగా పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఊపందుకుంది.
టాప్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు ఇప్పుడు ఏ హీరోని కదిలించినా చేతిలో రెండు నుంచి నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇక్క సినిమా అయిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ చేతిలో కూడా మూడు సినిమాలున్నాయంటే మన హీరోలు ఎంత బిజీగా వున్నారో అర్థ చేసుకోవచ్చు.
ఇదే తరహాలో క్రేజీ స్టార్ హీరో కూడా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే అతని చేతిలో మూడు నుంచి నాలుగు ప్రాజెక్ట్ లున్నాయి. అయితే అందులో ఏవీ పూర్తి స్థాయిలో పూర్తి కాకుండా నత్తనడకన నడుస్తున్నాయి. ఏ సినిమాని పూర్తి చేయని సదరు స్టార్ హీరో రెండు మూడు సినిమాలు ప్రారంభానికి సతమతమవుతున్నా సరే మరో సినిమాని ట్రాక్ లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇటీవలే రెండు క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటించిన స్టార్ హీరో తాజాగా మరో స్టార్ ప్రొడ్యూసర్ ని పిలిచి పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోండి మనం సినిమా చేద్దాం అని చెప్పారట. అది పూజ వరకే అని, షూటింగ్ చేయడం కోసం నెలల తరబడి వేచి చూడాల్సిందేనని భావించిన సదరు నిర్మాత తనకు సినిమా ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరోతో తాను ఇప్పట్లో మీతో సినిమా చేయలేనని, అదేమంటే తనకు ఆరోగ్యం బాగాలేదని సాకు చెప్పిమరి షాకిచ్చాడట.
ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరో పిలిచి ఆఫర్ ఇచ్చిన సదరు నిర్మాత రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ముందు అంగీకరించి, ముహూర్తం జరుపుకున్న సినిమాలు సంవత్సరాలుగా సెట్స్ లో ముందుకు వెనకకు కదులుతూ పూర్తి కాకపోవడంతో పాటు ఆయా నిర్మాతలు ఇప్పటికీ ఆ సినిమాల కోసం భారీ మొత్తంలో వడ్డీలు కడుతుండటమే నని తెలిసింది.
వాళ్లలా తను కూడా ఏళ్ల తరబడి స్టార్ హీరో కోసం ఎదురు చూడలేనని, కోట్లు కోట్లు కుమ్మరించి తన పిలిపు కోసం ఏళ్ల తరబడి వేచి చూడలేనని సదరు నిర్మాత స్టార్ హీరోకే నిర్మొహమాటంగా తేల్చి చెప్పి షాకిచ్చిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.