Begin typing your search above and press return to search.

సంక్రాంతి సెంటిమెంట్ వైపు స్టార్ పెయిర్!

By:  Tupaki Desk   |   10 April 2021 3:30 AM GMT
సంక్రాంతి సెంటిమెంట్ వైపు స్టార్ పెయిర్!
X
స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా 'మాస్టర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కరోనా లాక్డౌన్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ గా మాస్టర్ నిలిచింది. అయితే మాస్టర్ విజయంతో ఊపులో ఉన్నటువంటి దళపతి.. త్వరలో తన 65వ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమం ముగించుకున్న ఈ సినిమాను రెగ్యులర్ షూట్ ఏప్రిల్ చివరిలో లేదా మే మొదటిభాగంలో స్టార్ట్ చేయనున్నట్లు టాక్. అయితే ఫస్ట్ టైం దళపతి సరసన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జతకట్టనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. దళపతి 65 సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు విజయ్. అలాగే ఇదివరకు కూడా విజయ్ నటించిన సినిమాలు సంక్రాంతి టైంలో విడుదలై బ్లాక్ బస్టర్స్ అయ్యాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను చకచకా పూర్తి చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ పూజాహెగ్డే కూడా తన కెరీర్లో ఇండస్ట్రీ హిట్ సంక్రాంతి టైంలోనే అందుకుంది. గతేడాది అలవైకుంఠపురంలో సినిమాతో అమ్మడు బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. కాబట్టి అటు దళపతికి ఇటు పూజాకు ఇద్దరికీ సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.