Begin typing your search above and press return to search.

బిజీబిజీగా ముస్తాబవుతున్న టక్ జగదీష్..!

By:  Tupaki Desk   |   18 March 2021 3:07 PM GMT
బిజీబిజీగా ముస్తాబవుతున్న టక్ జగదీష్..!
X
గతేడాది లాక్‌డౌన్ టైంలో థ్రిల్లర్ మూవీ 'వి'తో ఓటిటి తెరపై మెరిసిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం 'టక్ జగదీష్' అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నాడు. మజిలీ ఫేమ్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తుండగా.. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. నానితో నిన్నుకోరి లాంటి మంచి హిట్ తర్వాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ సినిమా ఇది. ఈ కాంబో నుండి మరో హిట్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 'టక్ జగదీష్' అనే డిఫరెంట్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ప్రేక్షకులలో మోస్తారు అంచనాలు నెలకొన్నాయి. కొన్నిరోజులుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇదివరకే విడుదల చేసిన 'టక్ జగదీష్' ఫస్ట్‌ లుక్, సాంగ్స్, గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ క్రియేట్ చేసాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. టక్ వేసుకొని భోజనం ముందు సాఫ్ట్ లుక్కులో కూర్చొన్న నాని.. ఇటీవల ఇంట్రడక్షన్ ప్రోమో సాంగ్ లో సంకలో కోడి పట్టుకొని రంగంలోకి దిగినట్లుగా ఊరమాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టక్ జగదీశ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని సమాచారం. ఇటీవలే రిలీజ్ చేసిన 'కోలో కోలన్న కోలో' మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో జగదీష్ నాయుడుగా నాని పవర్‌ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 23న టక్ జగదీష్.. థియేటర్లలో విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు. చూడాలి మరి జగదీశ్ నాయుడు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో..!