Begin typing your search above and press return to search.

బిగ్ బాస్-4 త్వరలో ప్రారంభం.. క్లారిటీ ఇచ్చిన 'స్టార్ మా' మేనేజ్మెంట్!!

By:  Tupaki Desk   |   20 July 2020 4:00 PM GMT
బిగ్ బాస్-4 త్వరలో ప్రారంభం.. క్లారిటీ ఇచ్చిన స్టార్ మా మేనేజ్మెంట్!!
X
పగలంతా కష్టపడి పనిచేసి సేదతీరుదాం అని టీవీ ఆన్ చేస్తే సీరియల్స్ వస్తాయి, సినిమాలు వస్తాయి.. రియాలిటీ షోలు కూడా కనిపిస్తాయి. కానీ అందులో కొన్ని మాత్రమే జనాలకు బాగా నచ్చుతాయి. కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకుల పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. గత మూడు సీసన్లుగా తెలుగు బుల్లితెర పై తెలుగు ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ ఏడాది జూలైలో నాలుగో సీజన్‌ ప్రారంభించాలని నిర్వాహకులు ఇదివరకే సమాచారం అందించారు. కానీ కరోనా ఇంతవరకు తగ్గలేదు బిగ్ బాస్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు, హోస్ట్‌ల కోసం నిర్వాహకులు ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌లుగా ఎవరు రానున్నారో అనే ప్రశ్న పై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి వరకు ఎవరికీ తెలియని సెలబ్రిటీలు ఒక్కసారి బిగ్ బాస్ షోకి వెళ్తే వారి మొత్తం అసలు స్వభావం, చరిత్ర అన్నీ బయట జనాలకు తెలుస్తాయి. ముఖ్యంగా ఎదుటివారితో ఎలా ఉంటారనేది బిగ్ బాస్ ద్వారా తెలిసిపోతుంది. అసలు ఈ షో ఈసారి ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఏర్పడింది. అయితే బిగ్ నిర్వాహకులు ఇదివరకు చెప్పినట్లుగానే స్టార్ట్ చేయబోతున్నట్లు తాజాగా క్లారిటీ ఇచ్చారు. స్టార్ మా ఛానల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్-4 ప్రారంభం కానుందని ఓ ప్రోమో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేసారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఆ ప్రోమో వీడియోలో కమింగ్ సూన్ అని తెలిపారు. ఇక ఈ వీడియోతో బిగ్ బాస్ లవర్స్ కి ఓ తీపివార్త అందిందని చెప్పవచ్చు.