Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్ కి బాగా మండినట్లుందే

By:  Tupaki Desk   |   22 Dec 2016 10:30 PM GMT
మహేష్ హీరోయిన్ కి బాగా మండినట్లుందే
X
మహేష్ బాబు మూవీ 1-నేనొక్కడినే చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన బ్యూటీ కృతి సనోన్. ఆ తర్వాత చైతుతో కలిసి టాలీవుడ్ ని దోచేద్దామని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు. అంతలోనే బాలీవుడ్ ఆఫర్స్ అందడంతో.. ఎంచక్కా అక్కడ వాలిపోయిన కృతికి ఇప్పుడు చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలే ఉన్నాయి. అయినా సరే.. రీసెంట్ గా ఈమె చేసిన కామెంట్స్ చూస్తే.. వారసులుగా వచ్చి వెలిగిపోతున్న హీరోయిన్స్ ని చూసి ఈ అమ్మడికి బాగా మండిపోతున్నట్లుగా ఉంది.

ఇప్పుడు బాలీవుడ్ లో ఆలియా భట్.. శ్రద్ధాకపూర్.. సోనమ్ కపూర్.. సోనాక్షి సిన్హా లాంటి స్టార్ వారసులకు సినిమాలు రావడం చాలా తేలిక. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'స్టార్ల వారసులకు అన్నీ తేలికగా వచ్చేస్ాతయి. చిన్నప్పటి నుంచి వీళ్లు తెలిసి ఉండడంతో.. బడా నిర్మాతలు కూడా వారిని లాంఛ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్లీ మళ్లీ అవకాశాలిస్తారు. కానీ బయట నుంచి వచ్చినవాళ్లే ఇక్కడ బోలెడన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది' అంటూ అక్కసు వెళ్లగక్కేసింది.

కృతి సనోన్ చెప్పిన యాంగిల్ కరెక్టే కానీ.. బాలీవుడ్ లో టాప్ రేంజ్ ఎదిగిన ఐశ్వర్యారాయ్.. కంగనా రనౌత్.. అనుష్క శర్మ లాంటి వాళ్లు కృతికి ఎందుకు గుర్తు రాలేదన్నదే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ జనరేషన్ వెనక్కెళితే కష్టపడి పైకొచ్చిన వాళ్లు ఇంకా బోలెడంత మంది ఉంటారు. బహుశా ఈమె బాధల్లా ఏంటంటే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో రాబ్తా.. ఆయుష్మాన్ ఖురానాతో బెరైలీ కి బర్ఫీ లాంటి సినిమాలు తప్ప.. స్టార్స్ నుంచి పిలుపు రావడం లేదన్నదే అసలు బాధ కావచ్చు. మరి షారుక్ మూవీ దిల్వాలేలో కూడా ఈమె నటించింది కదా.! మళ్లీ ఈ మంట ఎందుకో!