Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : సెక్సీ చూపులతో స్టార్‌ కిడ్ గుండెకోత

By:  Tupaki Desk   |   2 Oct 2021 11:30 AM GMT
ఫొటోటాక్ : సెక్సీ చూపులతో స్టార్‌ కిడ్ గుండెకోత
X
బాలీవుడ్ లో ఈమద్య కాలంలో సరా అలీ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. హీరోయిన్‌ గా తండ్రి మరియు కుటుంబం బ్యాక్ గ్రౌండ్‌ కారణంగా పరిచయం అయినప్పటికి తనకంటూ గుర్తింపు దక్కించుకునేలా ఈ అమ్మడు కష్టపడుతోంది. ఒకప్పుడు దాదాపుగా 90 కేజీలకు పైగా బరువు ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలనే పట్టుదలతో 30 కేజీలకు పైగా బరువు తగ్గిందట. తన బరువు తగ్గే క్రమంలో చాలా కష్టపడినట్లుగా ఆమె పలు ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ సమయంలో కనీసం సరిగా తినేది కాదట.. అంతే కాకుండా గంటల తరబడి జిమ్ లో వర్కౌట్లు చేసేదట. మొత్తానికి ఈ అమ్మడు బరువు తగ్గేందుకు అందంగా కనిపించేందుకు ఎంత కష్టపడిందో అప్పటి ఫొటోలను ఇప్పటి ఫొటోలను కంపైర్ చేస్తే అర్థం అవుతుంది.

స్టార్‌ కిడ్ అయినా కూడా ఇండస్ట్రీలో స్టార్‌ అవ్వడం అంత సులభం ఏమీ కాదు. సైఫ్‌ అలీ ఖాన్‌ వంటి స్టార్‌ హీరో కూతురు అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకోవడం కోసం సరా అలీ ఖాన్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సినిమాలతో పాటు ఇండస్ట్రీలో ఆకట్టుకునే హాట్ ఫొటో షూట్ లను కూడా ఈ అమ్మడు షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటో క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతోంది. అంతే కాకుండా ఆ మత్తెక్కించే కళ్లతో చూస్తుంటే గుండెలను కోసినట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ అందాల ప్రదర్శణ మరియు చూపుతో ఎందుకు ఇంతగా గుండెకోత చేస్తున్నావని సరా ను ముద్దుగా ఆడిపోసుకుంటున్న అభిమానులు సోషల్‌ మీడియాలో చాలా మంది ఉన్నారు.

హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న సరా అలీఖాన్‌ ముందు ముందు ఆలియా భట్ రేంజ్ లో అందరిని ఆకట్టుకుటుందని.. ఆ స్థాయి హీరోయిన్ అవుతుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఆలియా భట్ కూడా స్టార్‌ కిడ్‌ అయినా కూడా సొంత ట్యాలెంట్‌ తో నిలిచింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది. సరా అలీ ఖాన్ కూడా పడే కష్టంకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందం విషయంలో ప్రతి ఒక్కరిని వెనక్కు నెట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.