Begin typing your search above and press return to search.
అఖిల్ అయ్యప్ప మాల వేయడానికి మెగా హీరోనే కారణమా...?
By: Tupaki Desk | 24 Jun 2020 2:20 PM ISTఅక్కినేని యువ హీరో అఖిల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య అఖిల్ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అందరూ హీరోలు ఏదొక విధంగా బయటకి వస్తున్నా అఖిల్ మాత్రం తన బర్త్ డే తర్వాత దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా బయటకి వచ్చాడు అఖిల్. సడన్ గా అఖిల్ అయ్యప్ప స్వామి మాల ధరించి దర్శనమికొచ్చాడు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని అయ్యప్ప మాలలో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అఖిల్ తన అన్నావదినలు నాగచైతన్య - సమంత మరియు తల్లిదండ్రులు నాగార్జున - అమల లతో కలిసి దిగిని పిక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫోటోలు చూసిన తర్వాతే అఖిల్ అయ్యప్ప దీక్షలో ఉన్నాడని అందరికి తెలిసింది. ఇప్పటి వరకు ఫ్యాషన్ దుస్తుల్లో నేటితరం కుర్రాళ్లకు ప్రతిరూపంలా ఉండే అఖిల్ ఎవరూ ఎక్ష్పెక్త్ చేయని విధంగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాకుండా ఇంతవరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలాంటి అయ్యప్ప దీక్ష చేసినట్లు కనిపించలేదు. అక్కినేని వారు చాలా వరకు సినిమా ఫ్యాషన్ లైఫ్ తోనే బిజీగా గడుపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్స్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎదో ఒక దైవ దీక్షలో ఉంటారు కానీ అక్కినేని ఫ్యామిలీలో ఎప్పుడూ ఇది కనిపించలేదు. ఇప్పుడు అఖిల్ సడన్ గా ఇలా సర్ ప్రైజ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అఖిల్ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళడానికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అనుకుంటున్నారు. చరణ్ - అఖిల్ ఎంత క్లోజ్ గా ఉంటారనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. దీనికి తోడు చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకొని దీక్ష కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన మిత్రుడు అఖిల్ కి దీక్ష చేపట్టమని సలహా ఇచ్చి ఉంటాడని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా 'కింగ్' నాగార్జున వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కి ఆ సినిమా ఆశించినంత విజయం అందించలేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా అఖిల్ కి నిరాశే కలిగించింది. ఇప్పుడు నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ను డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పకులుగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా మరింత ఆలస్యం అయింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజైన సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.