Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: స్టార్ కిడ్ హిప్పీ స్టైల్..!
By: Tupaki Desk | 6 Aug 2019 10:33 AM ISTస్టార్ కిడ్స్ అంటే ఎవరు? అని అడిగితే స్టార్ హీరోల హీరోయిన్ల సంతానం అని జనరల్ డెఫినిషన్ ఉంటుంది కానీ అసలు అర్థం అది కాదు.. రాబోయే జెనరేషన్లో కాబోయే హీరోలు.. హీరోయిన్లు. అందుకే ప్రేక్షకుల్లో వారి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టే స్టార్ కిడ్స్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటారు. బాలీవుడ్ లో భారీ మార్కెట్ ఉన్న ఖాన్ సాబ్ ఆమిర్ ఖాన్. ఆయన పిల్లలంటే అందరికీ ఆసక్తే.
ఖాన్ సాబ్ గారికి ముగ్గురు పిల్లలు. మొదటి భార్య రీనా దత్ ద్వారా జునైద్ ఖాన్.. ఈరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. రెండో భార్య కిరణ్ రావ్ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్ అనే మరో అబ్బాయి ఉన్నాడు. జునైద్.. ఆజాద్ ల సంగతేమో కానీ ప్రస్తుతం ఈరా ఖాన్ తన ఫోటో షూట్ల ద్వారా సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది. 20 ఏళ్ళ ఈరా ఇప్పటికే తన పచ్చబొట్టు ఫోటోలతో.. మోడరన్ దుస్తులలో ఎన్నో సార్లు నెటిజన్లను షాక్ కు గురి చేసింది.. తాజాగా మరోసారి అదే పని చేసింది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ 'హూ ఆర్ యూ' థీమ్ తో ఈ ఫోటో షూట్ జరిపినట్టుగా తెలిపింది.
దీని గురించి వివరిస్తూ "నీవెవరు అనే ప్రశ్నకు నా జీవితంలోని వివిధ సందర్భాలలో సమాధానం లేదు. ఎన్నో సార్లు ఈ ప్రశ్న ఉదయించినా.. జవాబు తెలుసుకోలేక పోవడం నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. అయితే మనల్ని ఉత్తేజపరిచే విషయాలను మనం ఎంచుకోవచ్చు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో.. ఎన్ని పనులు చేయాలనుకుంటున్నావో అవి చేయగలవు. ఒక్క విషయం మాత్రమే నిన్ను డిఫైన్ చెయ్యలేదు. ఈ ఫోటో షూట్ లో ఫ్యాషన్ అనేది నాకొక సాధనం.. నేనెవరు అని తెలుసుకోవడానికి ఉన్న మార్గాలలో ఇదొకటి" అని పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.
నువ్వెవరు అంటే 'నేను అంటే బాన పొట్ట బాడీ.. ఆ బాడీపై ఉండే బోడిగుండు' అని కాదు. నువ్వెవరు అంటే 'కాన్షియస్ నెస్'.. తెలుగులో 'స్పృహ'. మరి నిద్ర సమయంలో ఎలా స్ప్రహ ఉంటుంది? డీప్ స్లీప్ స్టేట్ లో ఎలా ఉంటుంది? మనకు ఉండదు.. నిజమైన 'కాన్షియస్ నెస్' ను తెలుసుకున్నవారికి ఉంటుంది. ఇదో డీప్ సబ్జెక్ట్..మరి ఇంత కాంప్లెక్స్ ఆలోచనలు మిస్టర్ పర్ఫెక్ట్ డాటర్ కు రాకపోతే మిస్టర్ ఇంపర్ఫెక్ట్ డాటర్లకు వస్తాయా? పాప డ్రెస్ విషయానికి వస్తే బ్రౌన్ కలర్ టాప్ తో డెనిమ్ షార్ట్స్ తో మరో అమ్మాయి కనికతో కలిసి పోజిచ్చింది. చేతిలో ఒక బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పూసలతో అల్లిన జడలతో.. నాభి రింగుతో హిప్పీల తరహాలో కనిపిస్తోంది. ఈ ఫోటోకు ఇన్స్టా లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "నీ స్టైలింగ్ సూపర్".. "నువ్వు ఎవరంటే.. ఆమిర్ డాటర్".. "సూపర్ ఫిట్.. పర్ఫెక్ట్ యాబ్స్'' అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో షూట్ల వాలకం చూస్తుంటే త్వరలోనే ఈరా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది.