Begin typing your search above and press return to search.

తన కలర్‌ పై వస్తున్న ట్రోల్స్‌ కు స్టార్‌ కిడ్‌ కౌంటర్‌

By:  Tupaki Desk   |   26 Feb 2021 12:00 PM IST
తన కలర్‌ పై వస్తున్న ట్రోల్స్‌ కు స్టార్‌ కిడ్‌ కౌంటర్‌
X
బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ రెండు పదుల వయసుకు చేరింది. ఇప్పటికే ఆమె సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఏకంగా 1.5 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సుహానా ఖాన్‌ రెగ్యులర్‌ గా తన హాట్‌ అండ్ ఫ్యాషన్ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది ఆమె కలర్‌ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. ఆమె కలర్‌ పై చేసే ట్రోల్స్ కొన్ని సమయాల్లో శృతి మించుతున్నాయి. కొందరు ఏకంగా బూతులు వాడుతూ ట్రోల్‌ చేయడం కూడా జరుగుతుంది. బ్రౌన్ కలర్‌ లో కనిపించే సుహానా ఖాన్ స్వయంగా తనపై వస్తున్న ట్రోల్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి వాటిని చేస్తున్న వారికి సున్నితంగా కౌంటర్ ఇచ్చింది.

సుహాన కొన్నాళ్ల క్రితం చాలా నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించడం కోసం ఆమె ఆపరేషన్‌ చేయించుకుంది. దాంతో ఆమె అందంగా కాకుండా అబ్బాయిగా మారిందని కొందరు, నవ్వు అప్పుడే బాగున్నావు ఇప్పుడు అందంగా కనిపించడం లేదు అంటూ మరి కొందరు కామెంట్‌ చేశారు. తనపై వస్తున్న కామెంట్‌ లను స్క్రీన్‌ షాట్‌ లతో సహా షేర్‌ చేసిన సుహానా ఖాన్ వారందరిని ఉద్దేశించి చిన్న తనంలో ఉన్నప్పుడు ఒకలా పెద్ద అయిన తర్వాత మరోలా ఉండటం చాలా కామన్‌. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చిన్నప్పుడుకు పెద్దగా మారిన తర్వాత మార్పులు వస్తాయి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్‌ చేయడం ఏమాత్రం సబబు కాదు అన్నట్లుగా పేర్కొంది. 12 ఏళ్ల వయసులో నా స్కిన్‌ టోన్‌ వల్ల నేను కాస్త ఎబెట్టుగా ఉన్నా ఇప్పుడు నాలో మార్పు వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తన కలర్‌ పై వస్తున్న ట్రోల్స్ కు సుహానా ఖాన్ ఇచ్చిన కౌంటర్ తో అయినా ట్రోల్స్ ఆగేనా చూడాలి.