Begin typing your search above and press return to search.

ఇక్కడ హిట్టు తీసి గట్టుమీద పెట్టరాదు!

By:  Tupaki Desk   |   28 Feb 2022 11:30 AM GMT
ఇక్కడ హిట్టు తీసి గట్టుమీద పెట్టరాదు!
X
ఇండస్ట్రీలోకి ఎవరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారన్నది కాదన్నయ్యా .. హిట్టు కొట్టామా లేదా అనేదే పాయింటు. ఇక్కడ పరిగెత్తాలంటే హిట్టు చేతిలో ఉండాలి .. ఎవరైనా పలకరించాలంటే హిట్టు చేతిలో ఉండాలి. కాల్ చేస్తే అవతలివారు లిఫ్ట్ చేయాలన్నా ఇక్కడ చేతిలో ఉండవలసింది హిట్టే. అదొక్కటి చేతిలో లేకపోతే గాండీవం లేకుండా అర్జునుడు యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో .. అలాగే ఉంటుంది. అందుకే ఇక్కడ అంతా హిట్టుకోసం వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ హిట్టు అనేది ఎప్పుడూ చేతిలోనే ఉండాలి .. తీసి గట్టుమీద పెడితే అంతే సంగతులు.

సాధారణంగా ఒక దర్శకుడు ఒక హిట్ ఇస్తే .. మరో హిట్ కోసం అదే దర్శకుడితో కలిసి పని చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒకరిపై ఒకరికి ఏర్పడే స్నేహం .. నమ్మకం కూడా మరో సినిమా చేయడానికి మరో కారణమవుతూ ఉంటుంది. ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ దానికి తోడుగా హిట్ అనేది ఉండాల్సిందే. అప్పుడే ఆ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కడానికి అవకాశం ఉంటుంది. 'జనతా గ్యారేజ్'తో తనకి హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఎన్టీఆర్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

ఇక తనకి 'అతడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది.

ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగుకి రెడీ అవుతున్న బన్నీ, ఆ తరువాత సినిమాను బోయపాటితో చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధంగానే ఉంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ తో 'పుష్ప 2' పూర్తి చేయగానే సుకుమార్ తో సెట్స్ పైకి వెళ్లడానికి చరణ్ సిద్ధంగా ఉన్నాడు. 'రంగస్థలం' సినిమా హిట్ కావడంతో, ఆయన నుంచి మరో సక్సెస్ ను అందుకోవాలనే ఆసక్తితో చరణ్ ఉన్నాడు.

ఇక హరీశ్ శంకర్ నుంచి 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ ను అందుకున్న పవన్, ఆయన దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా హిట్టు కోసం హీరోలంతా హిట్టు కాంబినేషన్ నే నమ్ముకుంటున్నారు. అంతకు ముందు తాము కలిసిచ్చిన హిట్టు చూపించే ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నారు.