Begin typing your search above and press return to search.

హీరోయిన్ల డ్యాన్స్ వెనక ఎవరున్నారో

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:30 AM GMT
హీరోయిన్ల డ్యాన్స్ వెనక ఎవరున్నారో
X
సినీ'మా' అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు - హీరోయిన్లు - సీనియర్లు - టెక్నీషియన్లు.. ఇలా అనేక మంది కొలువుదీరడంతో.. ఆడిటోరియం అంతా కళకళలాడిపోయింది. అవార్డులు అందచేయడం ఒక ఎత్తయితే.. అంతకు మించి డ్యాన్సు పెర్ఫామెన్సులతో స్టేజ్ ధగధగలాడింది. చివర్లో మెగాస్టార్ చిరంజీవి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అయితే.. మొత్తం ప్రోగ్రామ్ కే స్పెషల్ అట్రాక్షన్.

అయితే.. చిరంజీవి డ్యాన్సుతో పాటే అందరినీ ఆకట్టుకున్న మరో అంశం ఉంది. ఈ సారి స్టార్ హీరోయిన్స్ అందరూ లైవ్ పెర్ఫామెస్స్ ఇచ్చి దుమ్ము దులిపేశారు. తమలోని డ్యాన్సింగ్ ట్యాలెంట్ ని కళ్లకు కట్టేశారు. శ్రియ - రకుల్ ప్రీత్ సింగ్ - రాశి ఖన్నా - తమన్నా.. ఇలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అంతా స్టేజ్ పై చిందులేసేశారు. ఆడియన్స్ కి తమ అందాలతో పాటు అభినయం కూడా చూపించి ప్రశంసలు పట్టేశారు. ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఇంతమంది పెద్ద హీరోయిన్స్ డ్యాన్సులు చేసిన సందర్భం.. టాలీవుడ్ లో ఇదొక్కటే.

గతేడాది ఇదే అవార్డ్ ఫంక్షన్ లో అయితే.. రాయ్ లక్ష్మి - శాన్వి లాంటి చిన్న హీరోయిన్ల డ్యాన్సులతోనే కార్యక్రమం పూర్తయిపోయింది. లాస్టియర్ కి ఇప్పటికి తేడా ఏంటంటే.. ఇప్పుడు మా టీవీ స్టార్ గ్రూప్ చేతిలో ఉంది. అందాల భామలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి బాగానే ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు చిరంజీవి డ్యాన్స్ చేయనుండడంతో.. పెద్ద హీరోయిన్స్ తోనే చేయించేలా కేర్ తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. రీజన్ ఏదైనా.. స్టేజ్ మాత్రం ముద్దుగుమ్మలతో కళకళ్లాడిన మాట వాస్తవం.