Begin typing your search above and press return to search.

దళపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్.. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ!!

By:  Tupaki Desk   |   19 Jan 2021 11:30 PM GMT
దళపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్.. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ!!
X
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా బాలీవుడ్ వెండితెర మీద కూడా హీరోయిన్ పూజా హెగ్డే హవా నడుస్తోందని తెలుస్తుంది. ఈ భామ చేతిలో అన్ని బిగ్ సినిమాలే ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. 'అరవింద సమేత', మహర్షి, గద్దలకొండ గణేష్ లాంటి భారీ విజయాల తర్వాత గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇంకా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న అమ్మడి కెరీర్ నక్కతోక తొక్కినట్లుగా మారింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. తాజాగా అమ్మడు దళపతి విజయ్ సరసన అవకాశం కొట్టేసినట్లు సమాచారం. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పూజా దాదాపు ఖరారు అయిందని తెలుస్తుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న విజయ్ తో సినిమా అంటే పూజా పంట పండిందనే చెప్పాలి. త్వరలో అధికారిక ప్రకటన దర్శకనిర్మాతలు ప్రకటిస్తారని ఇండస్ట్రీ టాక్. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అన్పిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న పూజా ఇక కోలీవుడ్ లో కూడా కాలు మోపిందంటే చూడాలి మరి.. అమ్మడి అదృష్టం ఎలా ఉందో..!!