Begin typing your search above and press return to search.

'స్క్రిప్ట్ రైటింగ్' వైపు స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   19 March 2021 4:30 PM GMT
స్క్రిప్ట్ రైటింగ్ వైపు స్టార్ హీరోయిన్..!
X
స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే బాల్యంలోనే సినిమాల్లో అడుగుపెట్టిన శృతికి చిన్నప్పటి నుండి సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్ లాంటివి చాలా ఇంటరెస్ట్. ఆ విధంగానే తను పెరిగినకొద్దీ మ్యూజిక్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఆఖరికి సినిమాల్లో హీరోయిన్ గా మారేసరికి వాటికీ కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ అప్పుడప్పుడు తన టాలెంట్ బయటపెడుతూనే ఉంటుంది. శృతి నటిగా సినిమాల్లో ప్రవేశించి పదేళ్ల పైనే అయింది. అయితే లాక్డౌన్ ముందు వరకు శృతి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఎప్పుడైతే క్రాక్ సినిమాతో హిట్టు కొట్టిందో.. అప్పుడే అవకాశాలు పెరిగి బిజీ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ తో సలార్ సినిమా ఉంది.

ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తను మరో కొత్తపని మొదలు పెట్టిందట. లాక్డౌన్ సమయంలో సినిమా కథలు రాసిపెట్టుకున్నట్లు ఆ మధ్యలో చెప్పింది శృతి. ఇప్పుడు షూటింగ్ లేని సమయాల్లో ఆ స్టోరీలకు స్క్రిప్ట్ రాసే పని పెట్టుకుందట అమ్మడు. మ్యూజిక్ గురించి అంటే అల్లాడిస్తుంది కానీ స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఆమెకు కొత్తేనట. మొత్తానికి స్వయంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తుందంటే అభినందించాల్సిన విషయమే. మరి శృతి రాస్తున్న స్క్రిప్ట్ లతో ఆమెనే సినిమా తీస్తుందా.. లేక వేరే వాళ్ల చేతిలో పెట్టనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శృతి నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.